జపాన్‌లో బుల్లెట్ ట్రయిన్‌కు ప్రమాదం!
- December 12, 2017
టోక్యో : భారత్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న బుల్లెట్ ట్రయిన్ నిజంగా సురక్షితం కాదని వార్తలు వస్తున్నాయి. ఇందుకు తాజాగా జపాన్ రాజధాని టోక్యోలని షింకాన్షెన్ బుల్లెట్ ట్రయిన్లో పొగలు, మంటలు, బీటలు వారింది. ఈ షింకాన్షెన్ బుల్లెట్ ట్రయిన్ సంస్థే.. భారత్‌లోనూ బుల్లెట్ ట్రయిన్ ప్రాజెక్టును నిర్మిస్తోంది. ఆ సంస్థకు చెందిన రైలే భవిష్యత్‌లో భారత్‌లో పరుగులు తీయనుంది.
వివరాల్లోకి వెళితే...బుల్లెట్ ట్రయిన్ విభాగంలో అత్యంత శక్తివంతమైన షింకాన్షెన్ బుల్లెట్ ట్రయిన్ కు బుధవారం తృటిలో ప్రమాదం తప్పింది. పట్టాలు బీటలు వారడంతో.. రైల్లో మంటలు, పొగలు వచ్చాయి. అయితే ఈ ఘటనలో ప్రాణహాని లేకపోయినా.. బుల్లెట్ ట్రయిన్ వ్యవస్థలో ఇదో భారీ ప్రమాదంగా నిపుణులు చెబుతున్నారు. అత్యంత వేగంగా దూసుకుళ్లే ఈ రైలులో బుధవారం దక్షిణ జపాన్‌లోని నాగయ స్టేషన్ వద్ద పొగలు రావడం, అలాగే విచిత్రంగా వస్తున్న శబ్దాలు రావడాన్ని అధికారులు గుర్తించారు. ఆ వెంటనే రైలును పూర్తిగా నిలిపేశారు.
రైలును పూర్తిగా పరిశీలించిన అధికారులు చాసిస్ కింద ఆయిల్ లీక్ అవడం వల్ల పొగలు వచ్చాయని అధికారులు చెబుతున్నారు. ఈ ట్రయిన్ అలాగే మరికొంత దూరం ప్రయాణించి ఉంటే.. పరిస్థితులు అత్యంత దారుణంగా ఉండేవని అధికారులు చెబుతున్నారు. రైల్లోని వెయ్యి మంది ప్రయాణికులును మరో బుల్లెట్ ట్రైన్లో తరలించారు. ఈ ఘటనపై షింకాన్షెన్ అధికారులు మాట్లాడుతూ.. ఇది అసాధారణ సమస్య అని చెప్పారు. దీని గురించి మేం సీరియస్‌గానే చర్చిస్తున్నట్లు వారు తెలిపారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







