సత్యసాయి విద్యావిహార్‌లో క్రికెటర్ గంభీర్
- December 14, 2017
ఎంవీపీ కాలనీ(విశాఖ): హైదరాబాద్ నుంచి విశాఖ వరకు ఆర్‌బీఎల్ బ్యాంకు ఉద్యోగులు నిర్వహించిన సైకిల్‌దాన్ ముగింపు కార్యక్రమం శుక్రవారం విశాఖలోని సత్యసాయి విద్యావిహార్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి భారత క్రికెటర్ గౌతం గంభీర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. హైదరాబాద్‌లోని ఉద్దవ్ స్కూల్‌లో చదువుతున్న బాలికల సహాయార్థం సైకిల్‌దాన్ నిర్వహించినట్లు ఆర్‌బీఎల్ బ్యాంకు ఉద్యోగులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గౌతమ్ సైక్లిస్టులను అభినందించి వారితో పాటు కొద్దిసేపు సైక్లింగ్ చేశారు. అనంతరం సత్యసాయి స్కూల్ విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. సత్యసాయిబాబా చూపిన బాటలో విద్యార్థులు నడవాలని సూచించారు. అంతకుముందు గౌతమ్ గంభీర్‌ను సత్యసాయి విద్యావిహార్ పాఠశాల యాజమాన్యం ఘనంగా స్వాగతం పలికింది. కార్యక్రమంలో సత్యసాయి సేవాసంస్థల రాష్ట్ర అధ్యక్షులు ఎస్.జి.చలం, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కౌసల్య తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







