హైదరాబాద్ శివారులో గుప్తనిధుల కలకలం..
- December 14, 2017
హైదరాబాద్ శివారులో గుప్త నిధుల తవ్వకాలు కలకలం రేపాయి. అర్ధరాత్రి పూట రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మేడిపల్లిలోని ఓ పురాతన భవనంలోకి హైదరాబాద్‌కు చెందిన నలుగురు ప్రవేశించడానికి ప్రయత్నించారు. స్థానికులు అనుమానంతో ప్రశ్నించగా వారు పొంతన లేని సమాధానాలు చెప్పారు. దీంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. పురాతన భవనంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించిన వారిలో ఓ సాధువు ఉన్నారు. దీంతో గుప్త నిధుల కోసమే వారు వచ్చినట్టు అనుమానిస్తున్నారు.
గుంటూరు జిల్లాకు చెందిన నలుగురు కుషాయిగూడలోని ఓ ఆశ్రమంలో ఉంటున్నారు. వీరంతా రాత్రి పూట మేడిపల్లికి చేరుకొని ఓ పురాతన భవనంలోకి ప్రవేశించడం గ్రామంలో కలకలం సృష్టించింది. స్థానికులు గుప్త నిధుల కోసమే వీరు వచ్చినట్టు చెబుతున్నారు. పోలీసులు ఆ కోణంలోను దర్యాప్తు చేస్తున్నారు.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం







