మూడు నెలల తర్వాత చూడండి: మంత్రి నారాయణ
- December 14, 2017
మంగళగిరి : 'రాజధానిలో ఒక్క ఇటుక వేయలేదని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. ఇంకో మూడు నెలల తర్వాత వచ్చి చూడండి. రాజధానిలో ఎటుచూసినా ముమ్మరంగా పనులు జరుగుతూ కనిపిస్తాయి. అమరావతి ప్రపంచంలోని ఐదు ముఖ్య నగరాల్లో ఒకటిగా నిలిచి తీరుతుంది.' అని మునిసిపల్ శాఖ మంత్రి నారాయణ అన్నారు. రాజధాని అమరావతి పరిధిలోని ఎర్రబాలెంలో ఎన్టీఆర్ క్యాంటీన్‌ను గురువారం ఆయన మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో నారాయణ మాట్లాడుతూ 'ఒక ఇంటి ప్లాను డిజైన్ కోసమే నెలల సమయం తీసుకునే ఈ రోజుల్లో ఐదు కోట్ల మంది ప్రజలకు సంబంధించిన రాజధాని డిజైన్లను ప్రభుత్వం ఆషామాషీగా తీసుకోలేదన్నారు. 'ప్రస్తుతం రాజధాని డిజైన్లన్నీ ఖరారయ్యాయి. మూడేళ్లలో ఓ మంచి రాజధానిని నిర్మిస్తామని తొలుత చెప్పాం. ఎక్కువ నాణ్యతతో చేయాలన్న ఉద్దేశంతో కొంత సమయం తీసుకోవల్సి వచ్చింది.' అని వివరించారు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







