హైదరాబాద్ శివారులో గుప్తనిధుల కలకలం..

- December 14, 2017 , by Maagulf
హైదరాబాద్ శివారులో గుప్తనిధుల కలకలం..

హైదరాబాద్‌ శివారులో గుప్త నిధుల తవ్వకాలు కలకలం రేపాయి. అర్ధరాత్రి పూట రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మేడిపల్లిలోని ఓ పురాతన భవనంలోకి హైదరాబాద్‌కు చెందిన నలుగురు ప్రవేశించడానికి  ప్రయత్నించారు. స్థానికులు అనుమానంతో ప్రశ్నించగా వారు పొంతన లేని సమాధానాలు చెప్పారు. దీంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. పురాతన భవనంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించిన వారిలో ఓ సాధువు ఉన్నారు. దీంతో గుప్త నిధుల కోసమే వారు వచ్చినట్టు అనుమానిస్తున్నారు.

గుంటూరు జిల్లాకు చెందిన నలుగురు కుషాయిగూడలోని ఓ ఆశ్రమంలో ఉంటున్నారు. వీరంతా రాత్రి పూట మేడిపల్లికి చేరుకొని ఓ పురాతన భవనంలోకి ప్రవేశించడం గ్రామంలో కలకలం సృష్టించింది. స్థానికులు గుప్త నిధుల కోసమే వీరు వచ్చినట్టు చెబుతున్నారు. పోలీసులు ఆ కోణంలోను దర్యాప్తు చేస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com