కలుషిత బేబీ మిల్క్‌ ఫార్ములాపై బహ్రెయిన్‌ మినిస్ట్రీ ఉక్కుపాదం

- December 14, 2017 , by Maagulf
కలుషిత బేబీ మిల్క్‌ ఫార్ములాపై బహ్రెయిన్‌ మినిస్ట్రీ ఉక్కుపాదం

మనామా: మినిస్ట్రీ ఆఫ్‌ హెల్త్‌, నాలుగు బ్యాచ్‌ల బేబీ మిల్క్‌ ప్రోడక్ట్స్‌ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సర్క్యులర్‌ని జారీ చేయడం జరిగింది. ఫుడ్‌ సేఫ్టీ కంట్రోల్‌ డిపార్ట్‌మెంట్‌ ఈ వివరాల్ని వెల్లడిస్తూ, సాల్మొనెల్లా అగోనా అనే బ్యాక్టీరియా ఈ ప్రోడక్ట్‌లో ఉందని తెలిపింది. గత నెలలో ఫ్రెంచ్‌ అథారిటీస్‌, పలు బేబీ మిల్క్‌ ప్రోడక్ట్స్‌, అలాగే ఫుడ్‌ ప్రోడక్ట్స్‌పై బ్యాన్‌ విధించడం జరిగింది. ఆరు నెలలకంటే తక్కువ వయసున్నవారికి ఉపయోగించే ఆహారోత్పత్తుల్లో ఈ బ్యాక్టీరియా ఆనవాళ్ళను గుర్తించారు. యూరోపియన్‌ ఫుడ్‌ సేఫ్టీ కమిషన్‌ కూడా ఈ ఉత్పత్తులపై బ్యాన్‌ విధించింది. పలు బ్యాచ్‌ల వివరాల్ని పేర్కొంటూ, వినియోగదారులు ఆ ప్రోడక్ట్స్‌ని ఉపయోగించరాదని బహ్రెయినీ మినిస్ట్రీ స్పస్టం చేసింది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com