క్యాపిటల్‌ ఏరియాలో మరిన్ని టాయిలెట్స్‌ అవసరం

- December 14, 2017 , by Maagulf
క్యాపిటల్‌ ఏరియాలో మరిన్ని టాయిలెట్స్‌ అవసరం

మనామా: క్యాపిటల్‌ ఏరియాలో మరిన్ని పబ్లిక్‌ టాయిలెట్స్‌ అవసరమని రెసిడెంట్స్‌ డిమాండ్‌ చేస్తున్నారు. మనామా సౌక్‌ నుంచి సల్మానియా ఏరియా వరకు కేవలం ఒకే ఒక్క పబ్లిక్‌ టాయిలెట్‌ ఉందని రెసిడెంట్స్‌ చెబుతున్నారు. మెయిన్‌ మనామా బస్‌ టెర్మినల్‌ వద్ద ఉన్న ఈ టాయిలెట్‌లో మహిళా సెక్షన్‌ లాక్‌ చేయబడి ఉందని వారు ఆరోపిస్తున్నారు. అధికారులు ఈ విషయమై తగు చర్యలు తీసుకోవాలని రెసిడెంట్స్‌ విజ్ఞప్తి చేయడం జరిగింది. హమాద్‌ రోడ్‌, అబ్దుల్లా రోడ్‌లలో పబ్లిక్‌ టాయిలెట్స్‌ లేకపోవడం ఇబ్బందికరంగా మారిందనే విమర్శలు రెసిడెంట్స్‌ నుంచి వినవస్తున్నాయి. ఈ కారణంగా పురుషులు పబ్లిక్‌ గ్రౌండ్స్‌లో యూరినేట్‌ చేస్తున్నారనీ, తద్వారా చాలామందికి ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తుతున్నాయని ఆందోళన వ్యక్తమవుతోంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com