టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్.!
- December 17, 2017
శ్రీలంకతో జరగనున్న చివరిదైన మూడో వన్డేలో టాస్ నెగ్గిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఛేజింగ్ వైపు మొగ్గు చూపాడు. టాస్ నెగ్గిన వెంటనే ఫీల్డింగ్ చేయాలనుకుంటున్నట్లు చెప్పాడు. ఇదివరకే సిరీస్ లో లంక, భారత్‌లు 1-1తో సమ ఉజ్జీలుగా ఉన్నాయి. సిరీస్ ఫలితాన్ని నిర్ణయించే మూడో వన్డేలో నెగ్గి మరో సిరీస్‌ను తన ఖాతాలో వేసుకోవాలని రోహిత్ సేన ఎదురుచూస్తోంది. మరోవైపు భారతగడ్డమీద టీమిండియాపై ఎలాగైనా తొలి వన్డే సిరీస్ కైవసం చేసుకోవాలని లంకేయులు ఉవ్విళ్లూరుతున్నారు.
భారత జట్టులో ఓ మార్పు చేశారు. కొత్త కుర్రాడు వాషింగ్టన్ సుందర్‌కు నిరాశ ఎదురైంది. కీలకమైన మూడో వన్డేలో బౌలింగ్ దాడిని పెంచాలని అతడి స్థానంలో కుల్దీప్ యాదవ్ ను జట్టులోకి తీసుకున్నారు.
జట్ల వివరాలు:
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), ధావన్, శ్రేయస్ అయ్యర్, దినేశ్ కార్తీక్, మనీశ్ పాండే, ధోని, హార్దిక్ పాండ్యా, భువనేశ్వర్, బుమ్రా, చహల్, కుల్దీప్ యాదవ్.
శ్రీలంక: తిసారా పెరీరా (కెప్టెన్), గుణతిలక, తరంగా, సమరవిక్రమ, మాథ్యూస్, డిక్‌వెలా, గుణరత్నే, సచిత్, లక్మల్, అకిల ధనంజయ, నువాన్ ప్రదీప్.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్‌లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల