దుబాయ్ లో ‘సాక్ష్యం’
- December 17, 2017
టాలెంటెడ్ డైరెక్టర్ శ్రీవాస్, యువ కథానాయకుడు బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా ‘సాక్ష్యం’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. బెల్లంకొండ శ్రీనివాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని అభిషేక్ పిక్చర్స్ పతాకంపై నిర్మాత అభిషేక్ నామా నిర్మిస్తున్నారు. హైద్రాబాద్ రామోజీ ఫీలిం సిటీలో, పొల్లాచిలో, వారణాసి, హోస్ పేటలో కీలక సన్నివేశాలతోపాటు, యాక్షన్ సీక్వెన్స్ ను పీటర్ హెయిన్స్ నేతృత్వంలో తెరకెక్కించిన చిత్ర బృందం తాజా షెడ్యూల్ దుబాయ్ లో జరుపుకుంటోంది.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత అభిషేక్ నామా మాట్లాడుతూ.. ‘హైద్రాబాద్, పొల్లాచి, వారణాసి, హోస్ పేట వంటి ప్రాంతాల్లో భారీ క్యాస్టింగ్ తో భారీ సెట్స్ లో చిత్రీకరణ జరిపాం. సినిమాలో ఫైట్ సీక్వెన్స్ లు చాలా కీలకం అందుకే పీటర్ హెయిన్స్ మాస్టర్ ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని వాటిని తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం దుబాయ్ లో షూటింగ్ జరుగుతోంది. చిత్ర కథానాయకుడు బెల్లంకొండ శ్రీనివాస్ ఇంట్రడక్షన్ సాంగ్ తో పాటు కొన్ని కీలక సన్నివేశాలు ఓ స్టైలిష్ యాక్షన్ సీక్వెన్స్ ను తెరకెక్కించనున్నాం. అలాగే.. పూజా హెగ్డే, జయప్రకాష్, పవిత్ర లోకేష్, వెన్నెల కిషోర్ ల కాంబినేషన్ లో కొన్ని కీలక సన్నివేశాలను కూడా చిత్రీకరించనున్నాం. ఇటీవల విడుదలైన మోషన్ పోస్టర్ కి మంచి స్పందన లభించింది. వేసవి కానుకగా ‘సాక్ష్యం’ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నద్ధమవుతున్నాం’ అన్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







