మెంతులతో 15 అత్యుత్తమ ఆరోగ్య లాభాలు
- November 17, 2015
ప్రస్తుతం చాలామందిలో మధుమేహం ప్రధాన అనారోగ్య సమస్యగా మారింది. ఒత్తిడి, ఆందోళన కారణంగా.. చిన్న వయసులోనే.. తీపి పదార్థాలకి దూరమవ్వాల్సి వస్తోంది. డయాబెటిస్ తోపాటు, గుండె జబ్బులు ఎక్కువగా వేధిస్తున్నాయి. శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు, రక్తంలో షుగర్ లెవెల్స్ ఎక్కువ మోతాదులో పెరగడం వల్ల రకరకాల అనారోగ్య సమస్యలకు దారితీస్తున్నాయి. మెంతులతో 15 అత్యుత్తమ ఆరోగ్య లాభాలు డయాబెటిస్ తో బాధపడేవాళ్లు తీసుకునే ఆహారం విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. తీపి పదార్థాలకు దూరంగా ఉంటూనే.. పౌష్టికాహారం అందేలా చూసుకోవాలి. ముఖ్యంగా మెంతులు తీసుకోవడం వల్ల మంచి ఉపశమనం ఉంటుందని.. పరిశోధనలు చెబుతున్నాయి. ముఖ్యంగా షుగర్ వ్యాధిగ్రస్తులు మందులతో పాటు.. మెంతులను కూడా చేర్చుకుంటే.. సమస్య తీవ్రం కాకుండా.. అదుపులో ఉంటుంది. మగవాళ్ల ప్రత్యేక సమస్యలు దివ్వౌషదం ఫెనుగ్రీక్ ..! జుట్టు మెత్తగా ఉంచటానికి మెంతులు నూరి పెట్టుకోవడం తెలిసిందే. పచ్చళ్ళు, రసం, చారు మొదలైన వాటిల్లో మెంతులు వాడుతూ ఉంటారు. ఇవి సువాసనతో పాటు.. కమ్మని రుచిని అందిస్తాయి. డయాబెటిస్, గుండె జబ్బులతో బాధపడేవాళ్లు మెంతులు ఎంత పరిమాణంలో, ఏ రూపంలో తీసుకోవాలో తెలుసుకుందాం.. మెంతుల్లో ఫైబర్ ఎక్కువగా 50 శాతం ఉంటుంది. ఈ పీచు పదార్థం వల్ల రక్తం, మూత్రంలోని గ్లూకోజ్ స్థాయిని తగ్గిస్తుంది. కొలెస్ట్రారాల్ పెరిగితే గుండె జబ్బులకు ఆస్కారం ఉంది. కాబట్టి కొలెస్ట్రాల్ స్థాయిని మెంతులు గణనీయంగా తగ్గిస్తాయి. మెంతులను వంటకాల్లో ఉపయోగించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. మెంతులను ఏ మోతాదులో ఉపయోగించాలనేది షుగర్ వ్యాధి తీవ్రతను బట్టి ఉంటుంది. అలాగే శరీరంలో కొలెస్టరాల్ స్థాయిని బట్టి మోతాదు తీసుకోవాలి. వ్యాధి ప్రారంభంలో ఉన్నట్లైతే.. మెంతులను రోజుకు 25 గ్రాముల చొప్పున తీసుకోవాలి. ఒకేసారి మొత్తాన్ని తీసుకోకుండా.. మధ్యాహ్నం, రాత్రి భోజనంతో కలిపి తీసుకుంటే మంచిది. మెంతులను రాత్రంతా నీళ్లలో నానబెట్టి లేదా మెంతులను పౌడర్ గా చేసి మంచినీళ్ళు లేదా మజ్జిగలో కలుపుకుని భోజనానికి పావు గంట ముందు తీసుకోవడం మంచిది. నానబెట్టిన మెంతులను గుజ్జుగా చేసి, లేదా మెంతి పౌడరును వివిధ రకాల వంటకాల్లో వాడుకున్నా మంచిదే. రొట్టెలు, పెరుగు, దోశ, ఇడ్లి, ఉప్మా లాంటి రకరకాల కూరలు, వంటకాల్లో చేర్చితే మెంతుల చేదు తగ్గుతుంది.. రుచి కూడా బావుంటుంది. రక్తంలో, యూరిన్ లో షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నంత కాలం మెంతులను క్రమం తప్పకుండా తీసుకుంటూ ఉంటే వెంటనే ఉపశమనం పొందవచ్చు. మెంతులను తీసుకోవడంతోపాటు రోజూ క్రమం తప్పకుండా నడవటం వల్ల ప్రయోజనం ఉంటుంది. శరీరంలో కొవ్వును చేర్చే పంచదార పదార్ధాలను తీసుకోకుండా నియంత్రించాలి. ఒక స్పూన్ మెంతులు ఒక గ్లాస్ నీళ్ళలో వేసి రాత్రంతా నాన బెట్టాలి. ఉదయం లేవగానే ఆ నీళ్ళు తాగి, నానిన మెంతులు తింటే ఇన్సులిన్‌లా పని చేస్తుంది. మెంతుల్లో ఎన్నో రకాల విటమిన్లతోపాటు మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి. ఎన్నో ఔషధ గుణాలున్న మెంతులు ఆర్థరైటిస్, హై కొలెస్ట్రాల్, గాయాలు, దద్దుర్లు వంటి చర్మ సమస్యలను, బ్రాంకైటిస్, మలబద్దకం, కడుపులో వికారం, కిడ్నీ సంబంధ వ్యాధులు, గుండెల్లో మంట వంటి సమస్యలు నివారించడానికి సహకరిస్తాయి. పదిహేను గ్రాముల మెంతుల పొడిని వేడి నీటిలో మూడు గంటలపాటు నానబెట్టి రోజుకు రెండుసార్లు తీసుకుంటే బ్లడ్ షుగర్ తోపాటు చెడు కొలెస్ట్రాల్ లెవెల్ తగ్గుతుంది. తేలికపాటి డయాబెటిస్ ఉన్నవారు రెండున్నర గ్రాముల మెంతులను రోజుకు రెండుసార్లు మూడు నెలల పాటు తీసుకుంటే షుగర్ లెవెల్స్ తగ్గుతాయని నిపుణులు సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో పెయిడ్ కార్ లిఫ్ట్‌లపై ఆర్టీఏ హెచ్చరిక.. నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ జరిమానా
- దుబాయ్‌లో ఇళ్ల కొనుగోలుపై UBS ఆసక్తికర నివేదిక..!!
- కువైట్‌లో అత్యవసర ప్రణాళికలపై ఫైర్‌ఫోర్స్ సమీక్ష..!!
- ఖతార్‌లో డ్రైవింగ్ లైసెన్స్: అర్హతలు, నిబంధనలు, ఫీజుల పూర్తి వివరాలు..!!
- ప్రపంచ ముస్లింల మనోభావాలను హౌతీ దెబ్బతీస్తోంది..!!
- హోర్ముజ్ జలసంధి పునరుద్ధరణ..ఫ్రాన్స్‌తో జీసీసీ కీలక చర్చలు..!!
- మస్కట్‌లో రోడ్ల అభివృద్ధికి భారీగా పనులు..భద్రత బలోపేతం..!!
- ఇరాన్ పై ట్రంప్ తీవ్ర హెచ్చరిక.. ఒప్పందం కుదరకపోతే ‘అంతం చేస్తా’
- రక్షణ, ఏరోస్పేస్ పరిశోధనలకు ఊతం.. బిట్స్ పిలానీ, DIAT మధ్య 20 అవగాహన ఒప్పందాలు
- ‘వందేమాతరం’ వివాదం..డీకే శివకుమార్ ప్రభుత్వానికి గవర్నర్ హెచ్చరిక







