యూనిఫామ్ లేని ట్యాక్సీ డ్రైవర్లకు 500 సౌదీ రియాల్స్ జరీమానా
- December 20, 2017
జెడ్డా: నిబంధనల్ని ఉల్లంఘించే క్యాబ్‌లపై భారీ జరీమానాల వడ్డన తప్పదని పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ స్పష్టం చేసింది. పిటిఎ ఇన్స్పెక్టర్ బక్ర్ హాసావి మాట్లాడుతూ, మీటర్ లేని క్యాబ్‌లపై 5,000 సౌదీ రియాల్స్ జరీమానా పడుతుందని చెప్పారు. డ్రైవర్లకు ఒక వేళ యూనిఫామ్ లేకపోతే వారి నుంచి 500 సౌదీ రియాల్స్ జరీమానా వసూలు చేస్తామన్నారు. ట్యాక్సీపై 'ట్యాక్సీ రియాద్' లేదా 'ట్యాక్సీ జెడ్డా' అనే సైన్ లేకపోతే 1,000 సౌదీ రియాల్స్ జరీమానా విధిస్తామని తెలిపారాయన. ఫ్రంట్ సీట్ కంపెనీ లైసెన్స్ ఇన్ఫర్మేషన్ లేకపోతే 1,000 సౌదీ రియాల్స్, బ్యాక్‌సీట్ ఇన్ఫర్మేషన్ లేకపోతే 800 సౌదీ రియాల్స్ జరీమానా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఫస్ట్ ఎయిడ్ కిట్, ఫైర్ ఎక్స్టింగ్విషర్, హజార్డ్ ట్రయింగిల్ లేకపోతే ఒక్కోదానికి 500 సౌదీ రియాల్స్ జరీమానా పడుతుంది. ఈ జరీమానాల్ని దృష్టిలోపెట్టుకుని క్యాబ్ డ్రైవర్స్ నిబంధనల్ని పాటిస్తారని ఆశిస్తున్నట్లు పిటిఎ ఇన్స్పెక్టర్ బక్ర్ హసావి చెప్పారు.
తాజా వార్తలు
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!







