రేపు సూర్యుడు, శని ఒకే రాశిలోకి.. 350 ఏళ్ల తరువాత తొలిసారి.. ప్రళయానికి సంకేతమా?

- December 20, 2017 , by Maagulf
రేపు సూర్యుడు, శని ఒకే రాశిలోకి.. 350 ఏళ్ల తరువాత తొలిసారి.. ప్రళయానికి సంకేతమా?

అభివ‌ృద్ధిలో అగ్రపధం అని చాటి చెప్పుకుంటున్న పాశ్చాత్యులు సైతం జ్యోతిష్యాన్ని నమ్ముతున్నారు. రేపు డిసెంబర్ 21ని తక్కువగా అంచనా వేయొద్దంటున్నారు. ఆరోజు పగలు సమయం తక్కువగా ఉంటుంది. రాత్రి సమయం ఎక్కువగా ఉంటుంది. ఈ విధంగా ప్రతి ఏడాదీ జరిగేదే అయినా ఈ సారి వచ్చే 21 చాలా ప్రత్యేకమైనదంటున్నారు. సూర్యుడు, శని ఒకే రాశిలోకి ప్రవేశిస్తున్నాయని, ఇలా రావడం 350 ఏళ్ల తరువాత ఇదే తొలిసారని, ఇది ప్రళయానికి సంకేతమని హెచ్చరిస్తున్నారు. 

1664 తరువాత ఖగోళంలో ఇలాంటి మార్పు కనిపించడం ఇది తొలిసారని నీల్ స్పెన్సర్ అనే జ్యోతీష్యుడు తెలిపాడు. సాధారణంగా వ్యక్తుల జాతకంలో శని మకర రాశిలోకి ప్రవేశిస్తే మంచే జరుగుతుందని, అయితే ఖగోళ పరంగా ఇది చాలా ప్రమాదకరమైందని వివరిస్తున్నారు. కాబట్టి ఆ రోజు ఏ శుభకార్యమూ మొదలు పెట్టవద్దంటూ హెచ్చరిస్తున్నారు. కొత్త నిర్ణయాలు కూడా తీసుకోవద్దంటున్నారు. పలువురు ఆస్ట్రాలజీ నిపుణులు కూడా ఇదే విషయాన్ని నొక్కి వక్కాణిస్తున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com