వర్క్ ప్లేస్‌లో స్మోకింగ్కి భారీ మూల్యం తప్పదు
- December 20, 2017
మస్కట్: వర్క్ ప్లేస్‌లో స్మోకింగ్ చేయడం అలవాటా? అయితే వెంటనే మానుకోవాల్సిందే. లేదంటే 100 ఒమన్ రియాల్స్ జరీమానా చెల్లించాల్సి ఉంటుందని మస్కట్ మునిసిపాలిటీ హెచ్చరించింది. అడ్మినిస్ట్రేటివ్ డెసిషన్ నెంబర్ (55/2017) ఎన్‌ఫోర్స్‌మెంట్‌లోకి తీసుకొచ్చిన మునిసిపాలిటీ, వర్కింగ్ ప్లేసెస్‌లో అన్‌హెల్దీ అలవాట్లపై ఉక్కుపాదం మోపబోతోంది. చెల్లుబాటయ్యే హెల్త్ సర్టిఫికెట్ లేకుండా పనిచేస్తున్న కార్మికులకీ 100 ఒమన్ రియాల్స్ జరీమానా విధిస్తారు. హెల్త్ సర్టిఫికెట్ పొందేవరకూ విధుల నుంచి ఆ కార్మికుడు సస్పెండ్ అవుతాడు. అనారోగ్యం, గాయాలు వంటివాటితో బాధపడే కార్మికులకి 200 ఒమన్ రియాల్స్ జరీమానాతోపాటు, ఆ అనారోగ్యం నుంచి పూర్తిగా కోలుకునేదాకా వారిపై సస్పెన్షన్ వేటు పడ్తుందని మునిసిపాలిటీ పేర్కొంది.
తాజా వార్తలు
- Google 2026 Internship:యువత కోసం గోల్డెన్ ఛాన్స్
- అవసరమైతే కేటీఆర్ ను మళ్లీ పిలుస్తాం: సీపీ సజ్జనార్
- భక్తుల్లో సంతృప్తే లక్ష్యంగా రథ సప్తమి ఏర్పాట్లు: టీటీడీ అదనపు ఈవో
- ‘అరైవ్ అలైవ్’ లక్ష్యంతో సైబరాబాద్ పోలీసుల విస్తృత అవగాహన కార్యక్రమాలు
- యూఏఈ జాబ్ మార్కెట్లో పెను మార్పు: ఇక పై ఆ స్కిల్స్ ఉంటేనే ఉద్యోగం!
- తమిళనాడులో కొత్త సర్కార్ లోడింగ్: ప్రధాని మోదీ
- దుబాయ్ రవాణా వ్యవస్థలో టెక్నాలజీ విప్లవం: జనాభా పెరిగినా ప్రయాణం సాఫీగా!
- లోక్ భవన్లో మణిపూర్, త్రిపుర, మేఘాలయ రాష్ట్రావతరణ దినోత్సవాల వేడుకలు
- అజ్మాన్‌లో 3 నెలలు రోడ్ క్లోజర్: రషీద్ బిన్ అబ్దుల్ అజీజ్ స్ట్రీట్ మూసివేత
- అమెజాన్‌లో మరోసారి లేఆఫ్స్..వేలాది మంది ఉద్యోగుల పై వేటు!







