దుబాయ్ సఫారీ వైపు వెళ్ళే రోడ్లపై భారీ ట్రాఫిక్
- December 20, 2017
దుబాయ్ సఫారీలోకి ఉచిత ప్రవేశం నేటితో ఆఖరుకావడంతో, అటు వైపుగా వెళ్ళే దుబాయ్‌లోని రోడ్లన్నీ హెవీ ట్రాఫిక్‌తో నిండిపోయాయి. రస్ అల్ ఖోర్, ఎస్‌ఎంబిజెడ్ రోడ్ ట్రాఫిక్‌తో నిండిపోయాయని దుబాయ్ పోలీసులు ట్విట్టర్‌లో ట్రాఫిక్ అలర్ట్ కూడా పెట్టడం జరిగింది. షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ రోడ్‌పై ట్రాఫిక్ కారణంగా ఇ44 అల్ అవీర్ రోడ్, రస్ అల్ ఖోర్ ఇండస్ట్రియల్ ఏరియా వద్ద రోడ్స్‌పై వాహనదారులు ఇబ్బంది పడ్డారు. ఇటీవల సందర్శకులకు ఎంట్రీ గేట్స్ తెరుచుకోగా, దుబాయ్ సఫారీ పార్క్‌కి ఇప్పటికే 100,000 మంది విచ్చేశారు. రేపటినుంచి, అంటే డిసెంబర్ 21 నుంచి సందర్శకులకు టిక్కెట్ ద్వారా మాత్రమే ప్రవేశం ఉంటుంది. బుధవారం చివరి రోజున ఫ్యామిలీస్‌కి మాత్రమే ప్రవేశం కల్పిస్తున్నారు దుబాయ్ సఫారీ పార్క్ నిర్వాహకులు. అత్యాధునిక హంగులతో, ప్రపంచంలో వివిధ దేశాల నుంచి రప్పించిన పలు రకాలైన జంతువులు ఈ పార్క్‌లో సందర్శకులకు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. దుబాయ్ సఫారీ పార్క్, అరేబియన్ విలేజ్, ఆఫ్రికన్ విలేజ్, ఆసియన్ విలేజ్, అల్వాది మరియు సఫారీ విలేజ్ సందర్శన కోసం నిర్దేశించిన కాంబో టిక్కెట్ ధరలు పిల్లలకు 30 దిర్హామ్‌లు, పెద్దలకు 85 దిర్హామ్‌లుగా నిర్ధారించారు. సీనియర్ సిటిజన్లు, అలాగే మూడేళ్ళలోపు చిన్నారులకు ప్రవేశం ఉచితం.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం







