మానవ జీవితం విలువను చిన్నారులకు వివరిస్తున్న 'ఒమాన్ ప్రైడ్' కాంపైన్
- November 18, 2015
ఒమాన్ లోని ఫ్యూచర్ ఇంటర్నేషనల్ స్కూల్ వారు టైమ్స్ ఆఫ్ ఒమాన్ వారితో కలసి గత రెండువారాలుగా నిర్వహిస్తున్న'ఒమాన్ ప్రైడ్' కాంపైన్ లో భాగంగా , కేన్సర్ అవగాహన పెంపొందించే 'వాక్ ఫర్ కేన్సర్' అనే కార్యక్రమం ఒమాన్ కేన్సర్ అసోసియేషన్ వారి నిర్వహణలో జరిగింది. ఈ నడక కార్యక్రమంలో ఈ పాఠ శాల విద్యార్ధులు, వారి తల్లిదండ్రులు, సిబ్బంది, ఒమాన్ కేన్సర్ అసోసియేషన్ సిబ్బంది మరియు లైఫ్ లైన్ హాస్పిటల్ సిబ్బంది ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. దీనిద్వారా చిన్నారులు -దయతో కూడిన ఏ చిన్న చర్య అయినా, ఎంతో మంది జీవితాలకు సహాయపడుతుందని తెలుసుకున్నారు. ఇక, 'క్లోతింగ్ డొనేషన్ వీక్' అనేది తాము చేపట్టబోయే తదుపరి కార్యక్రమమని సంబంధిత అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- యూఏఈ: ప్రయాణికులకు ఓవర్‌స్టే జరిమానాల మాఫీ
- యూఏఈలో విద్యాసంస్థలకు మార్చి 9 నుంచి స్ప్రింగ్ బ్రేక్ సెలవులు
- నెల్లూరు నుంచి విదేశాలకు.. తీగలాగితే డొంక కదులుతోంది..!
- AIతో రూపొందించిన యుద్ధ వీడియోలపై ఎక్స్ కఠిన చర్యలు
- ఇరాన్ నౌక పై సబ్‌మెరైన్ దాడి
- యుద్ధంలోకి మమ్మల్ని లాగకండి: స్పెయిన్ ప్రధాని
- జెబల్ అలీ పోర్ట్‌లో యథావిధిగా కార్యకలాపాలు: భద్రతను కట్టుదిట్టం చేసిన అధికారులు!
- సౌదీలో 4రోజలపాటు ఈద్ అల్ ఫితర్ సెలవులు..!!
- వదంతులు, తప్పుడు వార్తల ప్రచారం పై దుబాయ్ పోలీస్ హెచ్చరిక ...
- చరిత్ర సృష్టించిన టీ20 ప్రపంచకప్









