2017లో 65 మంది జర్నలిస్టుల హత్య

- December 20, 2017 , by Maagulf
2017లో 65 మంది జర్నలిస్టుల హత్య

పారిస్‌: జర్నలిస్టులకు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడా రక్షణ లేదు. వ్యక్తిగత పగ, ఇతరత్రా ద్వేషాలతో 2017లో 65 మంది జర్నలిస్టులను అత్యంత క్రూరంగా అంతమొందించారు. ఇదే విషయాన్ని రిపోర్టర్స్‌ వితవుట్‌ బోర్డర్స్‌ సంస్థ తన వార్షిక నివేదికలో ప్రకటించింది. మొత్తం మృతుల్లో 60 శాతం మందిని వ్యక్తిగత కక్షతోనే హతమార్చినిట్లు నివేదిక స్పష్టం చేసింది. మరో 202 మంది జర్నిలిస్టులను బెదిరించడం, నిర్భంధించడం చేయడం జరిగిందని రిపోర్టర్స్‌ నివేదిక తెలిపింది. అంతేకాక మరో 54 మంది పత్రికా విలేకరులను ఉగ్రవాదులు నిర్భంధించారని సంస్థ పేర్కొంది.

ఇదిలా ఉండగా.. విధుల్లో ఉన్న 26 మంది జర్నలిస్టులు హత్య చేశారు. బాంబుదాడులు, వాయుదాడుల్లో పదుల సంఖ్యలో జర్నలిస్టులు మృత్యువాత పడడం జరిగిది. సిరియా, మెక్సికో, ఆఫ్ఘనిస్తాన్‌, ఇరాక్‌, ఫిలిప్పీన్స్‌ వంటి అత్యంత ప్రమాదకర దేశాల్లో జర్నలిస్టులు ప్రాణాలు పణంగా పెట్టి.. వార్తలను ప్రపంచానికి అందిస్తున్నారు. మృతుల్లో ఇద్దరు మహిళా జర్నలిస్టులూ ఉన్నారు.

చైనా, వియాత్నం, సిరియా, ఇరాన్‌లలో జర్నలిస్టులపై విపరీత ఆంక్షలు ఉన్నాయని, అక్కడ జర్నలిస్టుగా ఉద్యోగం చేయడం అంటే ప్రాణాన్ని పణంగా పెట్టడమేనని సంస్థ పేర్కొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com