విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల్లో పెను సంచలనం

- December 20, 2017 , by Maagulf
విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల్లో పెను సంచలనం

విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ సొసైటీ ఎన్నికల్లో పెను సంచలనమే నమోదైంది. ప్రధాన పార్టీలు బోల్తా పడగా, వామపక్షాలు విజయం సాధించాయి. నగరపాలక సంస్థ కో ఆపరేటివ్ సంఘం ఎన్నికల్లో భిన్న ధృవాలు కలిసి పోటీ చేశాయి. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరన్నట్లు... టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్ పార్టీలు కలిసి పోటీ చేశాయి. మొత్తం 11 మంది డైరెక్టర్లు ఉన్న వీఎంసీ సొసైటీకి రెండు రోజుల క్రితం ఎన్నికలు జరిగాయి. లెఫ్ట్ పార్టీలు బలపరిచిన ప్రోగ్రెసివ్ అభ్యర్థులు సహా టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్ బలపరిచిన వారంతా బరిలో నిలిచారు. సొసైటీలో 1888 ఓట్లు ఉండగా, ఎన్నికల్లో 1561 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ ఎన్నికల్లో ప్రోగ్రెస్సివ్ అభ్యర్థులు ఆరుగురు విజయం సాధించారు. అయితే టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్ కలిసికట్టుగా పోటీ చేయడమే ఓ వింత అయితే... మూకుమ్మడిగా ఓడిపోవడమూ అంతే ఆశ్చర్యంగా మారింది. బయటకు విమర్శలు చేసుకున్నా అంతర్గతంగా టీడీపీ, వైసీపీ నేతలంతా ఒకటే అని వామపక్ష నేతలు విమర్శిస్తున్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com