ఈక్వెడార్‌ రెస్టారెంట్‌లో పేలుడు, ఇద్దరు మృతి

- December 26, 2017 , by Maagulf
ఈక్వెడార్‌ రెస్టారెంట్‌లో పేలుడు, ఇద్దరు మృతి

క్రిస్మస్‌ పండుగ రోజు ఈక్వెడార్‌ రాజధానిలోని ఒక రెస్టారెంట్‌లో జరిగిన పేలుడులో ఒక చిన్నారితో సహా ఇద్దరు మరణించగా మరో 12 మందికి పైగా గాయపడ్డారని అధికారులు వెల్లడించారు. ఈ పేలుడు ఘటనలో ఏడేళ్ల చిన్నారితో పాటు 82 ఏళ్ల వృద్ధురాలు మరణించిందని క్విటో నగర మేయర్‌ కార్యాలయం ఒక ప్రకటనలో వెల్లడించింది. రెస్టారెంట్‌లో లీకయిన వంట గ్యాస్‌కు నిప్పు రవ్వలు తగిలి ఈ పేలుడు సంభవించిం దన్నారు. ఆ సమయంలో బాధితులందరూ రెస్టా రెంట్‌లో విందు ఆరగిస్తున్నారని తెలిపారు. ఈ పేలుడు లో దాదాపు డజనుకు పైగా కార్లు దెబ్బ తిన్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com