పోలాండ్-ఈజిప్టు విమానానికి బాంబు బెదిరింపు
- November 19, 2015
బాంబు బెదిరింపుతో పోలాండ్-ఈజిప్టు విమానం అత్యవసరంగా కిందకు దిగింది. బల్గేరియా రాజధాని సోఫియాలో ల్యాండ్ అయింది. విమానంలో బాంబు పెట్టినట్టు 64 ఏళ్ల ప్రయాణికుడు సమాచారం అందించాడని, అతడిని భద్రతా అధికారులు ప్రశ్నిస్తున్నారని బల్గేరియా మీడియా తెలిపినట్టు జిన్హువా వార్తా సంస్థ వెల్లడించింది. విమానం నుంచి ప్రయాణికులను దించేసి, సోదాలు చేపట్టారు. వార్సా నుంచి ఈజిప్టులోని రిస్టార్ట్ నగరం హర్గదాకు విమానం వెళుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. గత నెల 31న ఈజిప్టులోని సినాయ్ ద్వీపకల్పంలో కూలిన రష్యా విమానాన్ని ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు బాంబుతో పేల్చేశారని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో పోలాండ్-ఈజిప్టు విమానానికి బాంబు బెదిరింపు రావడంతో భయాందోళన వ్యక్తమవుతోంది.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం







