సెన్సార్ పూర్తి చేసుకొన్న 'అజ్ఞాతవాసి'
- January 02, 2018
పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి ఈ నెల 10న వరల్డ్ వైడ్ గా, చాలా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. రిలీజ్ డేట్ దగ్గర పడటంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచబోతుంది. ఆల్ రెడీ ఫస్ట్ లుక్ టీజర్, ఆడియో సాంగ్స్ తో పాటు కొన్ని మేకింగ్ వీడియోస్ అభిమానులతో పాటు అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. దీంతో అజ్ఞాతవాసిపై అంచనాలు పెరుగుతున్నాయి. ఆ అంచనాలను మరింత పెంచడానికి న్యూ ఇయర్ సందర్భంగా మరి కొన్ని పిక్స్ ని, మేకింగ్ వీడియోలను రిలీజ్ చేశారు మేకర్స్.
న్యూ ఇయర్ గిఫ్ట్ గా అజ్ఞాతవాసిలో పవన్ కళ్యాణ్ పాడిన పాటను నిన్న రిలీజ్ చేసింది టీమ్. కొడకా కోటేశ్వరరావు అంటూ సాగే ఈ పాట ఇప్పుడు యూట్యూబ్ లో ట్రెండ్ అవుతోంది. అనిరుథ్ అందించిన మ్యూజిక్ తో పాటు, పవన్ కళ్యాణ్ సూపర్బ్ గా పాడటంతో ఈ పాట ఆకట్టుకుంటోంది. ఆడియో సాంగ్ తో పాటు మేకింగ్ కూడా రిలీజ్ చేయడంతో ఈ సాంగ్ కి, లక్షల్లో వ్యూస్ వస్తున్నాయి. ఈ పాట పిక్చరైజేషన్ కూడా చాలా బాగుంటుంది అంటున్నారు యూనిట్ సభ్యులు.
ఇక అజ్ఞాతవాసి సంక్రాంతి కానుకగా ఈ నెల 10న విడుదలవుతోంది. ఆంధ్రా, తెలంగాణ, రాయలసీమతో పాటు కర్ణాటకలోనూ గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది. ఇక అమెరికాలో అయితే 570 పైగా లొకేషన్స్ లో విడుదలవుతూ రికార్డ్ సృష్టిస్తోంది. అమెరికాతో పాటు కెనడా, ఆస్ట్రేలియాల్లో అజ్ఞాతవాసిని రిలీజ్ చేస్తున్నారు. ఈ నెల 9నుంచి స్పెషల్ గా ప్రీమియర్ షోలు వేయడానికి డిస్ట్రిబ్యూటర్లు ప్లాన్ చేస్తున్నారు. సెన్సార్ పూర్తి చేసుకున్న అజ్ఞాతవాసి యుబైఎ సర్టిఫికేట్ తెచ్చుకుంది. పవన్ కళ్యాణ్ 25వ సినిమాగా, త్రివిక్రమ్ దర్శకత్వంలో రాధాకృష్ణ నిర్మించిన అజ్ఞాతవాసి, ఈ సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులు సృష్టించడం ఖాయం అంటున్నాయు ట్రేడ్ వర్గాలు.
తాజా వార్తలు
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్‌లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!







