హెచ్-1బీ వీసాదారులకు గుడ్‌న్యూస్
- January 09, 2018
వాషింగ్టన్: హెచ్-1బీ వీసాదారులకు ఊరట కలిగించే వార్త ఇది. సుమారు ఏడున్నర లక్షల మంది భారతీయులను అమెరికా నుంచి వెళ్లగొట్టేలా హెచ్-1బీ వీసాల పొడిగింపు చేయకూడదన్న తమ నిర్ణయంపై ట్రంప్ ప్రభుత్వం వెనక్కి తగ్గింది. అలాంటి ఆలోచనేమీ తమకు లేదని సోమవారం స్పష్టంచేసింది. గరిష్ఠంగా ఆరేళ్ల పాటు మాత్రమే అనుమతించేలా నిబంధనల్లో మార్పులు తీసుకొస్తున్నారన్న వార్తలు ఆందోళన కలిగించిన విషయం తెలిసిందే. హెచ్-1బీ వీసా పరిమితిని ఆరేళ్లకు మించి పొడిగించేలా అనుమతిచ్చే సెక్షన్ 104 (సీ)కి మార్పులు చేసి.. ఆ వీసాదారులను అమెరికా విడిచి వెళ్లేలా చేసే ఉద్దేశం మాకు లేదు. ఒకవేళ అలా చేసినా వచ్చిన నష్టం లేదు. ఎందుకంటే సెక్షన్ 106(ఎ)-(బీ) కింద ఎంప్లాయర్స్ ఏడాది చొప్పున పరిమితిని పెంచుకుంటే వెళ్లే అవకాశం ఉంటుంది అని యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్సీఐఎస్) మీడియా రిలేషన్స్ చీఫ్ జోనాథన్ వితింగ్టన్ స్పష్టంచేశారు. అధ్యక్షుడు జారీ చేసిన బయ్ అమెరికన్ హైర్ అమెరికన్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌ను అమలు చేసేందుకు కొన్ని విధానపరమైన మార్పులు చేస్తున్నామని ఆయన తెలిపారు. ఇప్పటికే పరిమితి పూర్తయి.. గ్రీన్‌కార్డుల కోసం వేచి చూస్తున్న లక్షలాది మంది ఇండియన్స్‌కు ఇది కచ్చితంగా ఊరట కలిగించే విషయమే. ఈ ప్రకటనకు ముందే ఇమ్మిగ్రేషన్ వాయిస్ గ్రూప్ తాము విజయం సాధించినట్లు తమ ఫేస్బుక్ పేజీలో ప్రకటించింది.
హెచ్-1బీకి సంబంధించి యూఎస్సీఐఎస్ తమ నిర్ణయాన్ని మార్చుకున్నట్లు ఈ గ్రూప్ స్పష్టంచేసింది.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







