మనల్ని మనం తెలుసుకోవడమే జీవితం: సద్గురు

- January 15, 2018 , by Maagulf
మనల్ని మనం తెలుసుకోవడమే జీవితం: సద్గురు

దుబాయ్:ప్రముఖ తాత్విక వేత్త, ఇషా ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు సద్గురు, 'మిస్టిక్‌ ఐ' పేరుతో జరిగిన ఈవెంట్‌లో అద్భుతమైన ప్రసంగంతో ఆహూతుల్ని ఆధ్మాతిక లోకంలో విహరింపజేశారు. సుమారు 6 వేల మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఫెస్టివల్‌ ఎరీనాలో ఈ కార్యక్రమం జరిగింది. 'నిన్ను నువ్వు పూర్తిగా తెలుసుకోవడమే జీవితం' అంటూ సద్గురు చేసిన ప్రవచనం, ప్రసంగం ఆహూతులందర్నీ తమను తాము ఆలోచించుకునేలా చేసింది. మనిషి లోపల ఉండే చెడుని పూర్తిగా బయటకు పంపెయ్యాలనీ, మానసిక ప్రశాంతతోనే మనిషి, మనిషిలా జీవించగలుగుతాడనీ, అలా జీవించగలిగినప్పుడే సాటి మనిషిలోనూ దేవుడ్ని చూడగలడనీ, తనలోనూ దేవుడున్నాడని నిరూపించుకోగలడని సద్గురు అన్నారు. మనిషి మనిషికీ మధ్య విభజన రేఖలు గీసుకుంటూ పోతే ఆ విభజన మానవాళి అంతానికే ఉపయోగపడ్తుందని సద్గురు ప్రవచించారు. భారత్‌ - పాకిస్తాన్‌ విడిపోవడానికి 'మతం' కారణం కాదనీ, ఆ పేరుతో తలెత్తిన విద్వేషాలు మాత్రమే కారణమని అన్నారాయన. నేను అనే విషయాన్ని పక్కన పెట్టి మనం మనుషులం, మనమందరం ఆత్మీయులమన్న భావనతో ఉండాలని పిలుపునిచ్చారు సద్గురు. మోడ్రన్‌ డే ఎడ్యుకేషన్‌ మానవత్వం గురించి తెలియజెప్పడంలో విఫలమవుతుందనీ, విద్య అనేది మనిషిని మేధావిగా మార్చకపోయినా, మనిషిలా ప్రవర్తించేలా చేయాలని అన్నారాయన. అమెరికాలో ఉన్నత శ్రేణికి చెందిన జంటలు, ఒకరికి ఇంకొకరు అండగా నిలవలేకపోతున్నారని, వారంలో ఒక్కసారి కూడా కలవలేనివారు భార్యాభర్తలెలా అవుతారని ప్రశ్నించారాయన. సంపాదన అనేది మెరుగైన జీవనం కోసమే తప్ప, ఆ జీవనం మనుషులతో మనుషులు కలవలేనంతగా సంపాదన వారిని మార్చెయ్యకూడదన్న చెప్పారు. తమని తాము బానిసలుగా మార్చేసుకోవడం తప్పని చెబుతూ, తమని తాము గౌరవించుకున్నప్పుడే ఇతరుల్ని గౌరవించడం, సమాజాన్ని గౌరవించడం సాధ్యమవుతాయని పిలుపునిచ్చారు సద్గురు. ఏ మతం అయినా చెప్పే మంచి ఒక్కటేననీ, ఆ మంచిని ప్రతి ఒక్కరూ ఆలోచిస్తే మతాలకతీతంగా ప్రతి ఒక్కరు ఉండగలుగుతారని సద్గురు చెప్పారు

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com