డ్రైవింగ్ టెస్ట్ కోసం లంచం: మహిళకు జైలు
- January 15, 2018
అరబ్ మహిళ ఒకరు, 500 దిర్హామ్‌లతోపాటు, చాక్లెట్లు ఇచ్చి డ్రైవింగ్ టెస్ట్ పాస్ అయ్యేందుకు ప్రయత్నించగా, ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు. న్యాయస్థానం ఆమెకు ఆరు నెలల జైలు శిక్ష విధించింది. అలాగే 5000 దిర్హామ్‌ల జరీమానా, డిపోర్టేషన్ కూడా ఆమెకు వర్తిస్తుంది. ఏడుసార్లు ఆ మహిళ డ్రైవింగ్ టెస్ట్ ఫెయిల్ అవడంతో, ఓ మహిళా ఉద్యోగికి లంచం ఇచ్చి టెస్ట్ పాస్ అవ్వాలనుకుంది. లంచం విషయమై మహిళా అధికారి, పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఉదంతం వెలుగు చూసింది. అయితే విచారణలో నిందితురాలు, బహుమతిగా మాత్రమే వాటిని ఇచ్చాననీ, అందుకు ప్రతిఫలంగా తాను ఏమీ కోరలేదని పేర్కొంది. తాను అన్యాయంగా ఈ కేసులో ఇరికింపబడ్డానని నిందితురాలు బుకాయించినా, న్యాయస్థానం మాత్రం ఆమె వాదనను తోసిపుచ్చి, ఆమెను ఈ కేసులో దోషిగా నిర్ధారించింది.
తాజా వార్తలు
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్







