యూఏఈ వ్యాప్తంగా పొగమంచు: విమాన రాకపోకలకు అంతరాయం
- January 15, 2018
యూఏఈలోని ముఖ్యమైన ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు కారణంగా విమాన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. నేషనల్ సెంటర్ ఫర్ మెటియరాలజీ (ఎన్‌సిఎం), రెసిడెంట్స్‌కి పొగ మంచు విషయమై ముందస్తుగానే హెచ్చరికలు జారీ చేసింది. రానున్న కొద్ది రోజులపాటు ఇదే వాతావరణ పరిస్థితి కొనసాగుతుందని పేర్కొంది. పొగమంచు కారణంగా విజిబిలిటీ బాగా తగ్గిపోయింది. దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి పలు విమానాలు పొగమంచు వల్ల ఆలస్యమయ్యాయి. కొన్ని విమాన సర్వీసుల్ని రద్దు చేయడం కూడా జరిగింది. మాంచెస్టర్, బర్మింగ్‌హామ్, లండన్, జైపూర్, బాకు, అల్జీయర్స్, గ్లాస్గోవ్, జెడ్డా తదితర ప్రాంతాల నుంచి వచ్చిన విమానాలు బాగా ఆలస్యమయ్యాయి.
తాజా వార్తలు
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..







