భారత్ - ఇజ్రాయెల్ మధ్య 9 ఒప్పందాలు

- January 15, 2018 , by Maagulf
భారత్ - ఇజ్రాయెల్ మధ్య 9 ఒప్పందాలు

భారత్ - ఇజ్రాయెల్ మధ్య 9 అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేశారు. సైబర్ సహాకారం, శాస్త్ర సాంకేతికత సహకారం, ఇందన సహకారంతో పాటు పలు అంశాలపై ఒప్పందాలు జరిగాయి.

ఇజ్రాయెల్ ప్రధాని రాకతో కొత్త ఏడాది ప్రత్యేకంగా ప్రారంభమైందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. నిన్న, ఇవాళ ఇరుదేశాల అభివృద్ధిపై చర్చించుకున్నాం. 120 కోట్ల మంది భారతీయుల తరపున ఇజ్రాయెల్ ప్రజలకు శుభాకాంక్షలు. గతంలో తీసుకున్న నిర్ణయాలు ఇప్పటికే సత్ఫలితాలు ఇస్తున్నాయి. ఇరు దేశాల మధ్య భాగస్వామ్యం మరింత బలోపేతం దిశగా చర్చలు సాగాయి. రక్షణ రంగంలోనూ పెట్టుబడులకు ఇజ్రయెల్‌ను ఆహ్వానిస్తున్నామని పేర్కొన్నారు.

నిన్న జరిగిన సమావేశంలో పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చలు జరిపామని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తెలిపారు. భారత్‌లో అపూర్వ స్వాగతం లభించింది. భారత్‌లో లభించిన ఆదరణ ఇజ్రాయెల్‌కు దక్కిన అపూర్వ గౌరవంగా భావిస్తున్నాం. భారతీయులు గొప్ప పౌరులు, సహనశీలురు, ప్రజాస్వామ్యవాదులు. ఇజ్రాయెల్‌లో మోదీ పర్యటనతో ఇరుదేశాల మధ్య బంధం మరింత బలోపేతమైందని పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com