బరువుకు నీటి కళ్లెం
- January 15, 2018
దాహం వేసినపుడు కొందరు నీళ్లకు బదులు కూల్‌డ్రింకులు, పళ్ల రసాలు, కాఫీ, టీ వంటివి తాగేస్తుంటారు. వీటితో అప్పటికి దాహం తీరొచ్చేమో గానీ చాలా దుష్ప్రభావాలు పొంచి ఉంటాయి. చక్కెరను కలిపి తయారుచేస్తారు కాబట్టి ఇవి బరువు పెరగటానికివి దోహదం చేస్తాయి. అందుకే దాహం వేసినపుడు మామూలు నీళ్లు తాగటమే మంచిదన్నది నిపుణుల సూచన. ఇలినాయిస్ విశ్వవిద్యాలయ తాజా అధ్యయనం దీన్ని మరోసారి బలపరిచింది. గతంలో నిర్వహించిన ఒక సర్వేలో పాల్గొన్న కొందరి ఆహార అలవాట్లను పరిశోధకులు ఇటీవల విశ్లేషించారు. వీరంతా సగటున రోజుకు 4.2 కప్పుల నీళ్లు, 2,157 కేలరీలను తీసుకుంటున్నట్టు గుర్తించారు. అయితే నీళ్లు ఎక్కువగా తాగినవారు మాత్రం కేలరీలు, తీపి పానీయాలు, కొవ్వు పదార్థాలు, చక్కెర, ఉప్పు తక్కువగా తీసుకోవటం గమనార్హం. రోజుకు 1-3 కప్పులు ఎక్కువగా నీళ్లు తాగినా 68 నుంచి 205 వరకు కేలరీలు తగ్గుతున్నట్టు బయట పడింది. అందువల్ల బరువు తగ్గాలని అనుకునేవారు తగినన్ని నీళ్లు తాగాలని, వీలైతే కాస్త ఎక్కువగా తీసుకోవటమూ మంచిదని పరిశోధకులు చెబుతున్నారు. అందువల్ల ఈసారి దాహం వేసినపుడు కూల్‌డ్రింకుల వంటి వాటి జోలికి వెళ్లకుండా మామూలు నీళ్లే తాగండి. దీంతో దాహం తీరటంతో పాటు బరువూ అదుపులో ఉంటుంది.
తాజా వార్తలు
- సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసిన వ్యక్తి అరెస్టు..!!
- యూఏఈ గోల్డెన్ వీసా హోల్డర్లకు కాన్సులర్ సేవలు..!!
- ప్రైవేట్ రంగంలో విదేశీ కార్మికుల నియామకంపై నిషేధం..!!
- సిద్రా మెడిసిన్‌లో ‘హీలింగ్ నోట్స్’ ప్రారంభం..!!
- SR21 మిలియన్ల విలువైన 39వేల రిజిస్ట్రేషన్లు రద్దు..!!
- సహామ్‌లో 7వేల సైకోట్రోపిక్ పిల్స్ స్వాధీనం..!!
- Android 16 ఆధారిత కొత్త అప్డేట్ వివరాలు
- విలువైన బిట్‌కాయిన్ సీజ్ చేసిన అమెరికా
- ఆస్కార్ రేసులో సౌదీ 'హిజ్రా' సినిమా..!!
- ఒమన్ లో పర్యావరణ పరిరక్షణకు ప్రోత్సాహం..!!