డ్రైవింగ్‌ లైసెన్స్‌: డ్రైవర్లకు స్లీప్‌ అప్నియా టెస్ట్‌ తప్పనిసరి

- January 15, 2018 , by Maagulf
డ్రైవింగ్‌ లైసెన్స్‌: డ్రైవర్లకు స్లీప్‌ అప్నియా టెస్ట్‌ తప్పనిసరి

దుబాయ్:రోడ్డుపై ప్రమాదాలకు స్లీప్‌ అప్నియా కూడా ఓ కారణమని దుబాయ్‌ హెల్త్‌ ఫోరమ్‌లో డాక్టర్‌ ఫబ్రిజియో ఫచ్చిని చెప్పారు. కన్సల్టెంట్‌ పల్మనాలజిస్ట్‌ వలియాంట్‌ క్లినిక్‌ - డాక్టర్‌ ఫబ్రిజో ఫచ్చిని మాట్లాడుతూ, స్లీప్‌ అప్నియా కారణంగా రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నట్లు అభిప్రాయపడ్డారు. ఇది సీరియస్‌ డిజార్టర్‌ అని ఆయన చెప్పారు. డ్రైవింగ్‌ లైసెన్స్‌ సందర్భంలో ఈ టెస్ట్‌ని తప్పనిసరిగా చేయించుకోవాలని డ్రైవర్లకు ఆయన సూచించారు. అకస్మాత్తుగా లేన్‌ ఛేంజింగ్‌ వంటి విషయాల్లో ఈ డిజార్డర్‌ ఉన్న డ్రైవర్లు వెంటనే తేరుకోలేరని, ఆ కారణంగా ప్రమాదాలు ఎక్కవగా జరుగుతుంటాయని ఆయన వివరించారు. స్లీప్‌ అప్నియాతో బాధపడేవారిలో సెవెర్‌ ఎక్సెసివ్‌ డేటైమ్‌ స్లీపినెస్‌ (ఇడిఎస్‌) సమస్య తలెత్తుతుందని అన్నారు. ప్రపంచ జనాభాలో 5 శాతం ఈ సమస్యతో బాధపడుతున్నట్లు అంచనా వేశారు. రోడ్డు ప్రమాదాల్లో 20 నుంచి 25 శాతం నిద్ర లేమి సమస్యల కారణంగానే జరుగుతున్నట్లు వివరించారాయన. నిద్రపోతున్న సమయంలో ఆయా వ్యక్తుల బ్రెయిన్‌ యాక్టివిటీని బట్టి సమస్యని వైద్యులు గుర్తించగలుగుతారనీ, తగిన చికిత్స తీసుకుంటే ఇదేమంత పెద్ద సమస్య కాదనీ, ఈ సమస్యకు సరైన వైద్య చికిత్స అందుబాటులో ఉందని డాక్టర్‌ ఫబ్రిజియో ఫచ్చిని వివరించారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com