అగ్ని ప్రమాదంతో మల్కియాలో మాతమ్‌ ధ్వంసం

- January 15, 2018 , by Maagulf
అగ్ని ప్రమాదంతో మల్కియాలో మాతమ్‌ ధ్వంసం

మనామా: అగ్ని ప్రమాదం కారణంగా మాతమ్‌ (కమ్యూనిటీ మరియు రెలిజియస్‌ సెంటర్‌) ధ్వంసమైన ఘటన నార్తరన్‌ గవర్నరేట్‌ పరిధిలో జరిగింది. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం కలగలేదు. ఇంటీరియర్‌ మినిస్ట్రీ వెల్లడించిన వివరాల ప్రకారం మల్కియా విలేజ్‌లో ఈ ప్రమాదం చోటు చేసుకుందనీ, తెల్లవారుఝామున 1.15 నిమిషాల సమయంలో అగ్ని ప్రమాదం జరిగిందనీ, ఎలక్ట్రిక్‌ షార్ట్‌ సర్క్యూట్‌ ఈ ప్రమాదానికి కారణమని తెలియవస్తోంది. సివిల్‌ డిఫెన్స్‌ డైరెక్టరేట్‌, సకాలంలో స్పందించి అగ్ని కీలల్ని ఆర్పివేశాయి. ఇస్లామిక్‌ ఎఫైర్స్‌ అండ్‌ ఎండోవ్‌మెంట్స్‌ మినిస్ట్రీ - జఫ్ఫారియా వక్ఫ్‌ డైరెక్టరేట్‌ (జెడబ్ల్యుడి) - జస్టిస్‌ ఈ ఘటనను ధృవీకరించింది. మాటమ్స్‌ మరియు రెలిజియస్‌ సెంటర్స్‌ - జఫ్ఫారీ సెక్షన్‌కి సంబంధించి జెడబ్ల్యుడి అధీకృత సంస్థ. జెడబ్ల్యుడి ప్రెసిడెంట్‌ షేక్‌ మొహ్‌సెన్‌ అల్‌ అస్‌ఫూర్‌, సంఘటనా స్థలాన్ని సందర్శించారు. తక్షణం ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన నివేదిక తనకు అందజేయాలని ఆయన సంబంధిత అధికారుల్ని ఆదేశించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com