2019లో ఒమన్‌ తొలి శాటిలైట్‌ లాంచ్‌

- January 15, 2018 , by Maagulf
2019లో ఒమన్‌ తొలి శాటిలైట్‌ లాంచ్‌

మస్కట్‌: ఒమన్‌ తొలి శాటిలైట్‌ అంతరిక్ష్యంలోకి 2019లో పంపనున్నారు. లైట్‌ పొల్యూషన్‌ని గుర్తించడం ఈ శాటిలైట్‌ ఉద్దేశ్యం. ఒమన్‌ ఆస్ట్రనామికల్‌ సొసైటీ (ఓఎఎస్‌)కి ఇది అత్యంత కీలకమైన ప్రయోగంగా శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ట్రాన్స్‌పోర్ట్‌, కమ్యూనికేషన్‌, టెలికమ్యూనికేషన్స్‌, ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌ ఇతర మంత్రిత్వ శాఖలు ఈ ప్రాజెక్ట్‌లో కీలక భూమిక పోషిస్తున్నాయి. ఓఎఎస్‌ ప్రెసిడెంట్‌ డాక్టర్‌ సలెహ్‌ బిన్‌ సైద్‌ అల్‌ షెతాని మాట్లాడుతూ, శాటిలైట్‌ని బేసిక్‌ మోడల్‌ (క్యూబ్‌ శాటిలైట్‌ లేదా క్యూబ్‌శాట్‌) అని తెలిపారు. శాటిలైట్‌ నిర్మాణ దశలో ఉందని డాక్టర్‌ సలెహ్‌ చెప్పారు. 2019లో శాటిలైట్‌ లాంఛ్‌ జరుగుతుందనీ, తేదీ విషయమై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఆయన వివరించారు. క్యూబ్‌ వాట్‌ బరువు 1.33 కిలోలు ఉంటుందనీ 10-10-10 సెంటీమీటర్ల క్యూబిక్‌ యూనిట్స్‌తో దీన్ని నిర్మించనున్నామని డాక్టర్‌ సలెహ్‌ తెలిపారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com