అందం చూద్దామని వచ్చిన బృందంకు ..హోటల్ వారి ఖరీదైన గంధం
- January 24, 2018
వెనిస్ : నీటిలో తేలే ఆ నగర అందాలను చూద్దామని పనిగట్టుకొని ఇటలీ లోని వెనిస్ నగర విహారయాత్రకు వెళ్ళిన నల్గురు జపాన్ విద్యార్థులు ఓ చోట జంకయ్యారు. ఆకలితో నక నక లాడుతూ డిన్నర్ చేద్దామని వారు హోటల్ కు వెళ్లారు. అక్కడ ఓ నాలుగు కాల్చిన మాంసం ముక్కలు..కొన్ని వేయించిన చేపలు, ఒక మినరల్ వాటర్ బాటిల్ మాత్రమే ఆర్డర్ ఇచ్చారు. ఆ పదార్ధాలన్నీ ఆరగించిన తర్వాత బ్రేవ్ మని తేల్చేలోపు వచ్చిన బిల్లు అక్షరాలా 1,004 అమెరికా డాలర్లు... అదే యూఏఈ కరెన్సీలో 5,181 ధిర్హాంలు ..భారతీయ కరెన్సీ లో 89 వేల 679 రూపాయలు మాత్రమే..ఆ మొత్తాన్ని చూసి..తాము ఉన్నది ఖచ్చితంగా ' ముంచేసి నగరం ' అని ఆ నలుగురికి పూర్తిగా అర్ధమయ్యింది...దీంతో వారు తేరుకొని తమకు జరిగిన భోజన దోపిడీపై అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెనిస్ నగరంలోని సెయింట్ మార్క్స్ కూడలి సమీపంలో ఉన్న ' ఒస్టరీయే డా లూకా రెస్టారెంట్ ' లో బిల్లుని జపాన్ విద్యార్థులకు వేడి వేడిగా వడ్డించారు. అయితే ఆ జపాన్ విద్యార్థుల బృందం ఆ బిల్లు చెల్లిందో లేదా తిరస్కరించిందోనన్న సమాచారం మాత్రం తెలియదు. వెనిస్ నగర మేయర్ లుయిగి బ్రుగ్నరో ఈ విషయమై స్పందించి పర్యాటకులు ఇచ్చిన ఆ ఫిర్యాదును పరిశీలిస్తానని వాగ్దానం చేశారు .అయితే, రెస్టారెంట్ యజమాని తనకు ఈ బిల్లు గోల తెలియదని నల్గురు జపనీయులు తమ సుష్టుగా భోజనం చేశారని వారితో ఎలాంటి సమస్య వచ్చినట్లు తనకు గుర్తు రావడం లేదని తెలిపాడు. గతంలోను పర్యాటకులకు ఈ ప్రాంతంలో పలు చేదు అనుభవాలు చూశారు.ఇదే విధమైన సంఘటనలో, బ్రిటీష్ పర్యాటకుడు తన తల్లిదండ్రులతో కలసి వెనిస్లో ట్రటోటో కాసనోవా అనే నఓ ఇటాలియన్ రెస్టారెంట్లో కొద్దిగా అల్పాహారం తీసుకొందామని వెళ్లారు..అంతే వారికీ 463 అమెరికా డాలర్లు (2,389 దిర్హాములు) 29 వేల 397 రూపాయల బిల్లుని చెల్లించి ఆ నగర హోటళ్ల దోపిడీకి విస్తుపోయి వెంటనే తమ దేశంకు వెళ్లిపోయారు.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







