కర్నాటక బంద్‌ బంద్‌..

- January 24, 2018 , by Maagulf
కర్నాటక బంద్‌ బంద్‌..

బెంగళూరు: మహదాయి నదీ జలాలను తమ రాష్ట్రానికి పంపిణీ చేయించాలని డిమాండ్‌ చేస్తూ కర్నాటకలో గురువారం బంద్‌ ప్రారంభమైంది. గోవా-కర్నాటక మధ్య ఈ అంతరాష్ట్ర నదీ జలాల పంపిణీ వివాద నేపథ్యంలో కర్నాటక రక్షణ వేదిక, వివిధ సంస్థలు రైతులు సంయుక్తంగా గురువారం బంద్‌ను ప్రకటించిన సంగతి తెలిసిందే. మహదాయి నది మిగులు జలాలను గోవా ప్రభుత్వం సముద్రంలోకి వృథాగా వదిలేస్తోందని, ఆ జలాలను కర్నాటక రైతులకు పంపిణీ చేయించాలని ప్రధాని నరేంద్రమెడీని కర్నాటక రక్షణ వేదిక డిమాండ్‌ చేస్తోంది. బంద్‌తో గురవారం కర్నాటకలో ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల కార్యాలయాలు తెరవలేదు. ఉదయం 6 గంటల నుండీ ప్రజా రవాణా వాహనాలు స్తంభించాయి. కర్నాటక ఆర్టీసీ బస్‌ కాంప్లెక్స్‌లో బస్సులు నిలిచిపోయాయి టాక్సీలు, ఆటోలు నిలిచిపోయాయి. పాఠశాలలు మూసివేశారు. బెంగళూరు మెట్రో సర్వీసులలో కొన్నింటిని మాత్రం నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. కర్నాటలో ఈ బంద్‌ కొనసాగుతుండగా బిజెపి అధ్యక్షులు అమిత్‌షా గురువారమే మైసూర్‌లో పర్యటించనున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com