ఉపాధికల్పన పైనే బడ్జెట్ ఫోకస్!
- January 25, 2018
న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికలకు ముందు మోడీ సర్కార్ ప్రవేశపెట్టనున్న చిట్టచివరి పూర్తిస్థాయి బడ్జెట్‌పై అంచనాలు ఊపందుకున్నాయి. బడ్జెట్‌లో అద్భుతాలను ఆవిష్కరించకున్నా యువతకు ఉపాధి అవకాశాలను పెంచే చర్యలకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని భావిస్తున్నారు. నూతన ఉపాధి అవకాశాలను అందుబాటులోకి తెచ్చేందుకు చిన్న, మధ్యతరహా పరిశ్రమలను ప్రోత్సహించే దిశగా బడ్జెట్‌ఉంటుందని అంచనాలున్నాయి. ఉపాధి రంగాలకు ఊతమిచ్చేలా ప్రభుత్వం ఆయా రంగాలకు ఉత్తేజం కల్పించాలని భారత ఎగుమతుల సంఘాల సమాఖ్య డైరెక్టర్ జనరల్ అజ§్‌ు సహా§్‌ు కోరారు. దేశీయ ఎగుమతుల రంగం పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలను కల్పిస్తున్న క్రమంలో ఈ రంగానికి సర్కార్ ఊతం కీలకమని ఆయన అభిప్రాయపడ్డారు. 1999లో 3.4కోట్ల మందికి ఉపాధిని కల్పించిన ఎగుమతుల రంగం ప్రస్తుతం 6.2కోట్ల మందకి ఉద్యోగావకాశాలను కల్పించిందన్నారు.
తాజా వార్తలు
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం







