సౌదీలో పలు ప్రాంతాల్లో కురిసిన మంచు
- January 26, 2018
సౌదీలోని పలు ప్రాంతాల్లో భారీగా మంచు కురిసింది. తెల్లని మంచు భారీగా పేరుకుపోవడంతో ప్రకృతి సౌందర్యాన్ని చూసి సౌదీ ప్రజలు ఆనందోత్సాహాల్లో మునిగిపోయారు. మౌంట్ అలోజ్ వ్యాలీ పరిసరాల్లో ఈ మంచు ఎక్కువ కురిసింది. సౌదీ అరేబియాలోని నార్త్ వెస్టర్న్ ప్రాంతాలు మంచుతో ఆహ్లాదంగా మారాయి. సౌదీ ప్రెస్ ఏజెన్సీ వెల్లడించిన వివరాల ప్రకారం ఈ మంచు శనివారం వరకూ కురిసే అవకాశం ఉన్నట్లు తెలియవస్తోంది. మంచు విపరీతంగా కురుస్తుండడంతో ట్రాఫిక్ సమస్యలు, ఇతర సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నందున భద్రతను కట్టుదిట్టం చేశారు. మౌంట్ అలోజ్ చుట్టూ భారీగా భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







