6 గంటలు 102 పాటలు: 12 ఏళ్ళ చిన్నారి ఘనత

- January 26, 2018 , by Maagulf
6 గంటలు 102 పాటలు: 12 ఏళ్ళ చిన్నారి ఘనత

సుచేతా సతీష్‌ అనే 12 ఏళ్ళ చిన్నారి కేవలం 6 గంటల్లోనే 102 పాటల్ని ఆలపించి అందరి చేతా ఔరా అన్పించుకుంది. భారత రిపబ్లిక్‌ దినోత్సవం నేపథ్యంలో ఇండియన్‌ కాన్సులేట్‌ ఆడిటోరియం - దుబాయ్‌లో జరిగిన కార్యక్రమంలో ఇండియన్‌ హైస్కూల్‌ స్టూడెంట్‌ సుచేతా సతీష్‌ తన ప్రతిభను చాటుకుంది. పలు రకాల భాషల్లో పాటల్ని ఆలపించడం, అది కూడా శ్రావ్యంగా ఆలపించడం గమనించదగ్గ అంశం. సాయంత్రం 4.10 నిమిషాలకు మొదలైన సుచేతా పాటల ప్రవాహం రాత్రి 10.30 నిమిషాల వరకు కొనసాగింది. ప్రస్తుతం ఏడో గ్రేడ్‌లో విద్యాభ్యాసం చేస్తోంది సుచేతా. అన్ని యూరోపియన్‌ లాంగ్వేజెస్‌, అలాగే భారతదేశానికి చెందిన 26 భాషలు, పలు సౌత్‌ అమెరికన్‌ లాంగ్వేజెస్‌, సౌత్‌ ఈస్ట్‌ ఏసియన్‌ లాంగ్వేజెస్‌లో ఆమె పాటలు పాడింది. పాటల్ని ఎంపిక చేసుకోవడం, గూగుల్‌ ట్రాన్స్‌లేటర్‌కి వెళ్ళి పాటల భావాన్ని అర్థం చేసుకోవడం, అలా ప్రాక్టీస్‌ చేయడం ద్వారా తన కుమార్తె ఈ ఘనతను సాధించినట్లు సుచేతా తండ్రి టి.సి సతీష్‌ చెప్పారు. కాన్సుల్‌ జనరల్‌ విపుల్‌ మాట్లాడుతూ, సుచేతా ప్రతిభ అనన్యసామాన్యమని కొనియాడారు. ఈవెంట్‌ కో-ఆర్డినేటర్‌ గిరీష్‌ పంత్‌ మాట్లాడుతూ, ఈ చిన్నారి ప్రతిభ మనందరికీ గర్వకారణమని అన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com