ఫాన్స్ ని తీవ్రంగా హార్ట్ చేసిన మహేష్ బాబు
- January 26, 2018
డైరెక్టర్ కొరటాల శివ సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో 'ఫస్ట్ ఓథ్' పేరిట వచ్చిన " భరత్ అనే నేను" సూపర్ స్టార్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ క్రమంలో సినిమాలో చెప్పిన డైలాగ్ తెలంగాణ మహేష్ బాబు అభిమానుల మనోభావాలను దెబ్బతీసింది అట. అసలు విషయానికొస్తే భరత్ అనే నేను సినిమా లో మహేష్ బాబు ముఖ్యమంత్రిగా నటిస్తున్నారని మనకందరికీ తెలుసు.
అయితే సినిమాలో ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ముఖ్యమంత్రి గా కనిపించడం తో తెలంగాణ ప్రాంతంలో ఉన్న అభిమానులకు మనసు నొచ్చుకుంది అట. రాష్ట్రం విడిపోయినా తరవాత అన్ని విషయాలలో భేదాభిప్రాయాలు వచ్చాయి కానీ సినిమా పరిశ్రమ విషయం వచ్చేటప్పటికి రెండు రాష్ట్రాల ప్రజలు తమ హీరోలను ప్రాంతీయపరంగా చూడకుండా తమ అభిమానాన్ని చాటుకున్నారు.
పైగా ఆంధ్ర ప్రాంతానికి చెందిన చాలామంది సినిమా హీరోలకు తెలంగాణ రాష్ట్రంలో మంచి మార్కెట్ ఉంది. ఈ క్రమంలో మహేష్ బాబు తనను తాను ఆంధ్రప్రదేశ్ ప్రాంత వ్యక్తిగా చూపించుకోవడం తెలంగాణను కొంత కించపరిచినట్లు ఉంది అని చాలామంది అభిమానులు అంటున్నారు.
దర్శకుడు ఈ విషయంలో కొంత జాగ్రత్త తీసుకుంటే బాగుండేది అని టాక్ కూడా వినిపిస్తుంది. రెండు రాష్ట్రాలు కలిసి ఉండేట్లు లేక మరో పేరు ఏదైనా ఆలోచించాల్సింది. మరి సినిమాలో కనీసం ఇతర అభిమానులు ఫీల్ అవ్వకుండా ఏమైనా జాగ్రత్తలు తీసుకున్నారో లేదో చూడాలి.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







