అనుమానిత డబ్బుని బదిలీ చేస్తున్న కేసులో నల్గురు నిందితులు అరెస్టు

- January 28, 2018 , by Maagulf
అనుమానిత డబ్బుని బదిలీ చేస్తున్న కేసులో నల్గురు నిందితులు అరెస్టు

కువైట్ : ఏడు లక్షల అమెరికా డాలర్ల అనుమానిత డబ్బుని బదిలీ చేస్తున్న కేసులో నలుగురు ఈజిప్షియన్లు పోలీసులు దాడి చేసి అరెస్టు చేశారు. వారు అయిదు లక్షల అమెరికా డాలర్లను 730,000 కువైట్ దినార్లకు ఓ అనుమానితునికి విక్రయించడానికి ఒప్పందం కుదుర్చుకున్నట్లు పొలిసు అధికారులు పేర్కొంటున్నారు.   ఒక పౌరుడు ద్వారా ఒక ఈజిప్షియన్ స్నేహితుడి నుండి ప్రతి 5 లక్షల అమెరికా డాలర్లకు 730,000 కువైట్ దినార్లకు విక్రయించేందుకు అంగీకరించారు. వీరు మొత్తం 20 లక్షల అమెరికా డాలర్ల నగదు (నకిలీ కాదు) కొనడానికి ఆ పౌరుడు ఒక అవకాశాన్ని పొందాడు. అయితే ఆ నిజాయితీగల  పౌరుడు ఫర్వానియా పోలీసు అధికారులకు వద్దకు వెళ్లి తనకు కొందరు ఇస్తున్న ఆఫర్ గురించి చెప్పాడు, ఒప్పందంలో భాగంగా వారికి సహకరిస్తున్నట్లు నటించమని పోలీసులు సూచించారు. కాగా ఆ పౌరుడు కోసం  డాలర్లను  రెండు బ్యాగ్ లతో  జబ్రియాలో ఐదుగురు ఈజిప్షియన్లు నిరీక్షిస్తూ కనిపించారు. పోలీసులు అకస్మాతుగా వారి మధ్యలో రావడంతో అక్కడ రెడ్ హ్యాండ్ గా దొరికిన నలుగురిని  అరెస్టు చేశారు, ఐదవ నిందితుడు అక్కడి నుంచి రెప్పపాటులో    తప్పించుకున్నాడు. మిగిలిన డాలర్లు ఎక్కడ దాచి ఉంచారో తెలుసుకోవడానికి ఆ నల్గురు అనుమానితులు ప్రశ్నించబడుతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com