జనాభా లెక్కల దిద్దుబాటులో పెద్ద సంఖ్యలో ఉపాంత అసాంఘటిత కార్మికులను తొలగింపు
- January 28, 2018
కువైట్:కువైట్ జనాభా గణనలో అసమతుల్యతను సరిదిద్దడానికి ప్రధాన సమస్యగా ఉపాంత మరియు అసాంఘటిత కార్మికులను పెద్ద ఎత్తున తొలగించనున్నట్లు స్థానిక మీడియా కువైట్ టైమ్స్ అల్-రాయ్ అరబిక్ వార్తా పత్రికలూ ఉదహరించాయి ఆ నివేదిక ప్రకారం, ఉన్నత కమిటీ ప్రతిపాదించిన పరిష్కారాలు జనాభాలో అసమతుల్యతకు పరిష్కారం కోసం 2014 లో ఏర్పడిన ప్రతిపాదనలు కేవలం కాగితంపై మాత్రమే మిగిలిపోయింది, ప్రక్రియను అమలుచేయడం "చాలా కష్టంగా" ఉందని పేర్కొంది. దేశంలో 1.8 మిలియన్ల మందికి ఉపాంత, అసాంఘటిత రంగంలో శ్రామికులున్నారు. జనాభా నిర్మాణం లేదా ఇతర కమిటీలు అధ్యయనం చేయడానికి ఉన్నత కమిటీ చేత ఏర్పడిన నిర్మాణాన్ని సరిదిద్దడానికి సంబంధించిన అన్ని సిఫార్సులు, ఫలితాలు ఉపాంత కార్మికులు అడ్డంకిగా ఏర్పడ్డారని తెలిపింది. గత కొన్ని సంవత్సరాలలో దేశంలో ఉన్న అసాంఘటిత శ్రామికులు, నివాసితుల్లో అత్యధికులను గుర్తించబడలేరని పేర్కొన్నారు. రెసిడెన్సీ ఉల్లంఘనలకు వ్యతిరేకంగా జరుగుతున్న తనిఖీ ప్రచారాలు ప్రస్తుతం సమస్యను నిర్మూలించడానికి మాత్రమే సాధ్యమైన పరిష్కారంగా మిగిలి ఉంది. వేలాదిమంది ఉల్లంఘనకారులను వెంటాడటం అంత సులభమైన చర్య కాదు, పెద్ద సంఖ్యలో శ్రామిక శక్తీ మరియు సుదీర్ఘకాలం వారి సేవలు సైతం కావాలని కూడా ఆ నివేదిక తెలిపింది. అయినప్పటికీ, కొత్త ఉపాంత కార్మికుల ప్రవేశాన్ని మరియు నిష్క్రమణను నియంత్రించగలిగింది. అధిక శ్రామికులను నియంత్రించడం పారిశ్యుద్ధ్య కార్మికులను తగ్గించడం మరియు తోట పనివారి కాంట్రాక్టులను 25 శాతం ప్రభుత్వం తగ్గించడం జరిగింది.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







