'ఇంటిలిజెంట్‌' ఫస్ట్ సాంగ్ విడుదల చేసిన ప్రభాస్

- January 28, 2018 , by Maagulf
'ఇంటిలిజెంట్‌' ఫస్ట్ సాంగ్ విడుదల చేసిన ప్రభాస్

హైదరాబాద్‌: ‘‘ఇంటిలిజెంట్‌’ సినిమాలోని ‘చమకు చమకు ఛాం’ పాట నా మోస్ట్‌ ఫేవరెట్‌. చిరంజీవి పాటల్లో  అతి ఉత్తమమైన పాట అది. ఆ పాటకు చిరు సూపర్‌గా డ్యాన్స్‌ చేశారు. ఇప్పుడు ఆ పాటలో తేజు ఎలా నటించాడని ఆతృతగా ఎదురుచూస్తున్నా’ అన్నారు కథానాయకుడు ప్రభాస్‌. సాయిధరమ్‌ తేజ్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘ఇంటిలిజెంట్‌’. వి.వి. వినాయక్‌ దర్శకత్వం వహిస్తున్నారు. లావణ్య త్రిపాఠి కథానాయిక. ఈ సినిమా టీజర్‌ను శనివారం నందమూరి బాలకృష్ణ విడుదల చేశారు. కాగా ఇందులోని ‘లెట్స్‌ డూ..’ అనే పాటను ఆదివారం ప్రభాస్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘పాట విడుదల చేయ్యాలని వినాయక్‌ మొహమాటపడుతూ నాతో అన్నారు. ఆయన ఒక మెసేజ్‌ చేస్తే చాలు ఏ వేడుకకైనా, ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను. నా జీవితంలో ‘యోగి’కి ఎంజాయ్‌ చేసినట్లు ఏ సినిమాకి చెయ్యలేదు. వినాయక్‌ చాలా సంతోషంగా ఉంటారని రాజమౌళితో చెప్పాను (నవ్వుతూ).  మేం ఇంకా చాలా కష్టపడాలి’.

‘తేజ్‌ ‘సాహో’ షూట్‌కు వచ్చాడు. వినాయక్‌తో కలిసి పనిచేయడం చాలా లక్కీ అని చెప్పా. ఈ సినిమా పెద్ద విజయం అందుకోబోతోంది. ఈ సినిమాలోని పాటలన్ని విన్నాను. చాలా బాగున్నాయి. మొత్తం చిత్ర బృందానికి శుభాకాంక్షలు. సినిమా బ్లాక్‌బస్టర్‌ అందుకోవాలని కోరుకుంటున్నా’ అని అన్నారు.

అనంతరం సాయిధరమ్‌ మాట్లాడుతూ.. ‘ప్రభాస్‌ అన్నను మా ఇంట్లో ఒక సభ్యుడిగా ఫీలవుతాం. మా చిత్రంలోని తొలిపాటను విడుదల చేసినందుకు అన్నకు ధన్యవాదాలు చెప్పాలి. ఇందులో నటించే అవకాశం ఇచ్చిందుకు వినాయక్‌కు, నిర్మాత కళ్యాణ్‌కు ధన్యవాదాలు. లావణ్య మంచి పాత్ర చేసింది. అందరం కలిసి మంచి సినిమా చేశాం. ఫిబ్రవరి 9న సినిమా చూసి మమ్మల్ని ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నా’ అని చెప్పారు. ఇదే సందర్భంగా లావణ్య త్రిపాఠి పాటను విడుదల చేసిన ప్రభాస్‌కు, చిత్రంలో నటించే అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు కృతజ్ఞతలు తెలిపారు.

‘కృష్ణంరాజు ఎప్పుడూ నవ్వుతూ ఉంటారు. ప్రతి ఒక్కరు సంతోషంగా ఉండాలి అని కోరుకునే రక్తం ఆ కుటుంబ సభ్యులది. అలాంటి మంచి వ్యక్తి ప్రభాస్‌ చేతుల మీదుగా చంద్రబోస్‌ రాసిన ‘లెట్స్‌ డూ..’ పాటను విడుదల చేయడం సంతోషంగా ఉంది’ అని నిర్మాత కళ్యాణ్‌ పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com