డాక్టర్ గా అవతారం ఎత్తిన రాజమౌళి
- January 30, 2018
'బాహుబలి' సీరీస్‌తో ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్నారు దర్శకధీరుడు రాజమౌళి. త్వరలో ఓ మల్టీస్టారర్ మూవీని పట్టాలెక్కించేందుకు ఆయన సన్నాహాలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఓ సినిమా కోసం రాజమౌళి డాక్టర్ అవతారమెత్తనున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. కాస్త వివరాల్లోకి వెళితే.. రాజమౌళి శిష్యుడు, 'ద్రోణ' (2009) చిత్ర దర్శకుడు కరుణ కుమార్ నూతన నటీనటులతో ఓ సినిమాని తెరకెక్కించనున్నాడు. సుకుమార్ శిష్యుడు, 'దర్శకుడు' మూవీ డైరెక్టర్ హరి ప్రసాద్ ఈ సినిమాకి కథ, మాటలు అందించనున్నాడు. ఈ చిత్రంలో కథకి కీలకమైన ఓ డాక్టర్ పాత్ర ఉందని.. దానికి రాజమౌళి అయితేనే బావుంటుందని కరుణ కుమార్ ఆయన్ని సంప్రదించగా.. పాత్ర నచ్చడంతో రాజమౌళి కూడా ఓకే చెప్పారట. ఇదివరకు కూడా రాజమౌళి కొన్ని చిత్రాల్లో అతిథి పాత్రల్లో మెరిసిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







