అమెరికా లో చైతు షూటింగ్
- January 30, 2018
ఫైట్ తర్వాత కుర్రాడి ప్రేమకు అమ్మాయి ఫిదా అయినట్లు ఉంది. అందుకే సాంగ్ వేసుకోవడానికి అమెరికా వెళ్లనున్నారట ఈ రీల్ లవర్స్. నాగచైతన్య, నిధి అగర్వాల్ జంటగా చందు మొండేటి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘సవ్యసాచి’. హీరో నాగచైతన్య అక్క పాత్రలో భూమిక నటిస్తుండగా, ఓ కీలక పాత్రలో మాధవన్ కనిపించనున్నారు. రీసెంట్గా తీసిన హైదరాబాద్ షెడ్యూల్లో చేజింగ్ ఫైట్‌లో విలన్స్‌ను చితక్కొట్టాడు చైతూ.
మార్చిలో జరిగే మరో షెడ్యూల్‌ను చిత్రబృందం అమెరికాలో ప్లాన్ చేసిందని ఫిల్మ్‌నగర్ సమాచారం. అక్కడ కొన్ని కీలకమైన సన్నివేశాలతోపాటు సాంగ్స్‌ను చిత్రీకరిస్తారట. అక్కడితో సినిమా ఆల్మోస్ట్ కంప్లీట్ అవుతుందట. జూన్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారని వినికిడి. ఈ చిత్రం కాకుండా ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో నాగచైతన్య ఓ చిత్రంలో నటిస్తోన్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి ‘శైలజారెడ్డిగారి అల్లుడు’ అనే టైటిల్‌ని పరిశీలిస్తున్నారు.
తాజా వార్తలు
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి
- ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్‌గా బండారు నరసింహరావు
- కామినేనిలో అత్యంత క్లిష్టమైన మోకీలు మార్పిడి శస్త్రచికిత్స
- భారత కాన్సులేట్ ను సీజ్ చేస్తాం: ఖలిస్థానీల హెచ్చరిక