అమరావతికి కొత్త హంగు అదిరిపోయేలా..ఎన్టీఆర్ విగ్రహం..!
- February 01, 2018
తెలుగు చలన చిత్రసీమలో నటసార్వభౌముడిగా మహానటుడిగా వెలిగిపోయారు..నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్). సాంఘిక, పౌరాణిక,జానపద చిత్రాల్లో తన అద్భుతమైన నటన కనబరచి తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. కేవలం సినిమాకే పరిమిత కాకుండా తెలుగువాడి ఆత్మగౌరవం కాపాడటం కోసం 1982 మార్చి 29న తెలుగుదేశం పేరుతో ఒక రాజకీయ పార్టీని స్థాపించి రాజకీయ రంగప్రవేశం చేసాడు. పార్టీని స్థాపించి కేవలం 9 నెలల్లోనే ఆంధ్ర ప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ఏకచ్ఛత్రాధిపత్యానికి తెరదించుతూ అధికారాన్ని కైవసం చేసుకున్నాడు.ఆ తరువాత మూడు దఫాలుగా దాదాపు 8 సంవత్సరాల పాటు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసి, అప్పటి వరకు అత్యధిక కాలం పనిచేసిన ముఖ్యమంత్రిగా నిలచాడు. ఇక ఎన్టీఆర్ మరణించిన తర్వాత తెలుగు దేశం అధ్యక్షులుగా ఏపీ సీఎం నారా చంద్రబాబు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కొత్తగా ఏర్పడింది..దీనికి అమరావతిని రాజధానిగా ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దాలని కలలు కంటున్న చంద్రబాబు అందుకు తగినట్టుగానే ప్రణాళికలు రూపొందిస్తున్నారు.కాస్త లేటుగా వచ్చినా లేటెస్టుగా రావాలన్నది ఆయన ఆలోచనగా కనిపిస్తోంది. అందుకే అమరావతిని అన్ని హంగులతో రూపొందిస్తున్నారు. అమరావతిలోని నీరుకొండ గ్రామంలో ఉన్న ఎత్తయిన కొండపై 108 అడుగుల ఎత్తున ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. ఈ ప్రతిపాదనపై అధికారులు సీఆర్డీఏ సమావేశంలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. రాజధానిలో అంబేద్కర్ విగ్రహాన్ని 125 అడుగుల ఎత్తున ఏర్పాటు చేస్తున్నారు. నీరుకొండ ఎత్తులో ఉన్న దృష్ట్యా ఎన్టీఆర్ విగ్రహం ఎత్తు కొంతమేర తగ్గించవచ్చని తెలుస్తోంది.
శాఖమూరు ఉద్యానవనంలో భాగంగా 19.5 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేస్తున్న గాంధీ పార్కుపై ఈ సమావేశంలో వీడియో ప్రెజెంటేషన్ ప్రదర్శించారు. పూజ్య బాపూజీ స్మృతిచిహ్నంగా నిర్మించే ఈ పార్కుకు 'గాంధీ టు మహాత్మా పార్కు' అనే పేరు పెట్టాలని ముఖ్యమంత్రి సూచించారు. గత కొంత కాలంగా ఎన్టీ రామారావుకు భారత రత్న ఇవ్వాలని ఆయన కేంద్రాన్ని కోరుతున్న విషయం తెలిసిందే. ఈ మేరకు మహానాడులో తీర్మానం చేయనున్నట్లు చెప్పారు. ఎన్టీ రామారావు స్ఫూర్తితో పనిచేస్తే సాధించలేనిదంటూ ఏదీ ఉండదని. ఆయన స్ఫూర్తితో మనం పనిచేయాలని ఆయన అన్నారు.
దేశ, రాష్ట్ర రాజకీయాల్లో ఎన్టీ రామారావుది విభన్నమైన శైలి అని చెప్పారు. గాంధీ పార్కుతో పాటు రాజధానిలో మరో రెండు ప్రాంతాలలో బాబూ జగజ్జీవన్ రామ్, జ్యోతిరావు పూలే పేరిట పార్కులను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.6 ఎకరాల విస్తీర్ణంలో అమరావతి మెరీనా ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనను ముఖ్యమంత్రి పరిశీలించారు.
ఏప్రిల్ 10 నుంచి 12 వరకు మూడు రోజుల పాటు జరిగే సంతోష నగరాల సదస్సు ద్వారా మరోసారి అమరావతి ప్రాభవాన్ని ప్రపంచానికి చాటే అవకాశం దక్కిందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు. మహానాడులో ఆయన మాట్లాడుతూ తెలుగు జాతి ఆత్మగౌరవ స్ఫూర్తి పేరుతో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుచేస్తున్నట్లు వెల్లడించారు. అదే విధంగా రాజధానిలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని కూడా ఏర్పాటుచేస్తామని తెలిపారు.
తాజా వార్తలు
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి
- ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్‌గా బండారు నరసింహరావు