సూపర్ స్టార్ రజనీ 'రోబో'లో మెగా రోల్
- February 03, 2018
రజనీకాంత్ - అక్షయ్‌కుమార్ - ఎమీజాక్సన్ కాంబోలో రానున్న మూవీ 'రోబో 2'. రిలీజ్ మాట కాసేపు పక్కనబెడితే టీజర్ మాత్రం ఈనెల చివర్లో విడుదల కానున్నట్లు సమాచారం. అందుకు సంబంధించిన పనులు వేగంగా జరుగుతున్నాయి. టీజర్‌కి సంబంధించిన సీజీ వర్క్స్ అమెరికాలో దాదాపు పూర్తి అయ్యాయన్నది యూనిట్ చెబుతున్నమాట. హైదరాబాద్‌లో జరిగే టీజర్ విడుదల కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి, మలయాళ సూపర్‌స్టార్స్ మోహన్‌లాల్, మమ్ముట్టిలను యూనిట్ ఇన్వైట్ చేయనున్నట్టు తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే ట్రైలర్ మార్చిలోగా రావడం ఖాయం. ఈ లెక్కన '2 పాయింట్ 0' ఏప్రిల్‌లో విడుదలయ్యే అవకాశాలు ఎక్కువగా వున్నాయి.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







