తెలుగు క్వీన్ కోసం డైరెక్టర్ రమేష్ అరవింద్..!
- February 03, 2018
బాలీవుడ్ లో సూపర్ డూపర్ హిట్ కొట్టిన క్వీన్ చిత్రం సౌత్ లోని నాలుగు భాషలలో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. హిందీలో కంగనా రనౌత్ పోషించిన పాత్రని తెలుగులో తమన్నా, తమిళంలో కాజల్, మలయాళంలో మంజిమా మోహన్, కన్నడలో పరుల్ యాదవ్ లు పోషిస్తున్నారు. క్వీన్ రీమేక్ చిత్రం కన్నడలో బటర్ ఫ్లై అనే టైటిల్‌తో తెరకెక్కుతుండగా, తెలుగులో క్వీన్ వన్స్ అగైన్, తమిళంలో పారిస్ పారిస్, మలయాళంలో జామ్ జామ్ అనే టైటిల్స్ తో రూపొందుంది. బాలీవుడ్ చిత్రం 'క్వీన్' ను నిర్మాత త్యాగరాజన్ తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో రూపొందిస్తుండగా, తెలుగు, మలయాళ భాషల్లో ఈ చిత్రాన్ని నీలకంఠ డైరెక్ట్ చేస్తున్నాడు. తమిళ, కన్నడ భాషల్లో రమేష్ అరవింద్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా మొదటి షెడ్యూల్ ఫ్రాన్స్ లో జరగగా, ఇటీవలే ముగిసింది. అయితే తెలుగు రీమేక్‌లో ప్రధాన పాత్ర పోషిస్తున్న తమన్నాకి, డైరెక్టర్ నీలకంఠకి మధ్య జరిగిన కొన్ని గొడవల వలన నీలకంఠ ఈ సినిమా నుంచి అర్థాంతరంగా తప్పుకున్నట్లు టాక్ వినిపించింది . దీంతో చిత్ర నిర్మాతలు కొత్త దర్శకుడి కోసం ప్రయత్నాలు చేయగా, కన్నడ యాక్టర్, డైరెక్టర్ రమేష్ అరవింద్ ఫ్రేమ్‌లోకి వచ్చినట్టు తెలుస్తుంది. కమల్‌తో ఉత్తమ విలన్ తెరెక్కించాడు రమేష్ అరవింద్.
త్వరలోనే తెలుగు వర్షెన్‌కి సంబంధించి షూట్ ప్రారంభించనున్నారని టాక్. ఈ మూవీలో సిద్ధు జొన్నలగడ్డ మేల్ లీడ్ చేస్తున్నాడు.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







