గ్లోబల్ విలేజ్‌లో షేక్ మొహమ్మద్ సర్‌ప్రైజ్ విజిట్
- February 03, 2018
యు.ఏ.ఈ:యూఏఈ వైస్ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్, దుబాయ్ రూలర్ ఆకస్మికంగా దుబాయ్ గ్లోబల్ విలేజ్‌లో పర్యటించారు. విలేజ్‌కి చెందిన పలు పెవిలియన్స్‌ని ఆయన సందర్శించారు. 75 దేశాలకు చెందిన పార్టిసిపెంట్స్ ఈ విలేజ్‌లో పలు పెవిలియన్స్‌లో ఉన్నారు. కువైట్, యెమెనీ, సౌదీ అరేబియా, ఇండియా, థాయిలాండ్, పలు ఆఫ్రికన్ దేశాలకు చెందిన వారి షాప్స్ ఇక్కడ ఉన్నాయి. దాదాపు రెండు దశాబ్దాల క్రితం ప్రారంభమైన ఈ గ్లోబల్ విలేజ్, ఎప్పటికప్పుడు సందర్శకుల్ని సరికొత్తగా ఆకట్టుకుంటోంది. నవంబర్ 1 నుంచి ఏప్రిల్ 7 వరకు సుమారు 300,000 చదరపు మీటర్ల వైశాల్యంలో పలు రకాలైన షాపింగ్, ఎంటర్‌టైన్‌మెంట్, పెస్టివల్ ఈవెంట్స్‌తో సందర్శకుల్ని గ్లోబల్ ఫెస్టివల్ కనువిందు చేస్తోంది. కువైట్ పెవిలియన్ నుంచి ప్రారంభించిన షేక్ మొహమ్మద్, అక్కడి ప్రత్యేకతల్ని తెలుసుకున్నారు. యెమెనీ పెవిలియన్ సమా ఇతర పెవిలియన్లనూ సందర్శించి, అక్కడి విశేషాల్ని పరిశీలించారు. రెండు కీలోమీటర్ల మేర షేక్ మొహమ్మద్ టూర్ కొనసాగింది. గ్లోబల్ విలేజ్ నిర్వహణపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







