ఉపాసనకు నిద్ర లేకుండా చేసిన బాగమతి అనుష్క !

- February 03, 2018 , by Maagulf
ఉపాసనకు నిద్ర లేకుండా చేసిన బాగమతి అనుష్క !

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన తన సామాజిక కార్యక్రమాల ద్వారానే కాకుండా సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటూ చరణ్ అభిమానులకు అను నిత్యం అందుబాటులో ఉంటుంది. చరణ్ వ్యక్తిగత విషయాలతో పాటు చరణ్ సినిమాలకు సంబంధించిన లేటెస్ట్ విషయాలను మెగా అభిమానులకు తరుచూ చేరవేస్తూ మెగా అభిమానులకు జోష్ కలిగిస్తూ ఉంటంది.అలాంటి ఉపాసనకు స్వీటి అనుష్క సమస్యగా మారిందట. ఈవిషయాన్ని స్వయంగా రామ్ చరణ్ తెలియచేసాడు. కొన్ని రోజుల క్రితం ఉపాసన చరణ్ దంపతులు 'భాగమతి' సినిమాను భాగ్యనగరంలోని ఒక ప్రముఖ ధియేటర్ లో చూడటం జరిగిందట.ఈసినిమా వారిద్దరికీ బాగా నచ్చడంతో చరణ్ ఈసినిమా దర్శకుడుని అదేవిధంగా అనుష్కని అభినందిస్తూ తన ఫేస్ బుక్ లో కామెంట్స్ చేయడం కూడ జరిగింది. అయితే ఈసినిమా చూసిన నాటి నుండి ఉపాసనకు సరిగ్గా నిద్ర పట్టడం లేదట. కళ్ళు మూసుకుని నిద్రపోతే చాలు పాడుపడిన భాగమతి కోట కలలోకి వస్తున్న నేపధ్యంలో ఉపాసన తరుచూ ఉలిక్కిపడి లేస్తోంది అంటూ చరణ్ అసలు విషయాన్ని బయట పెట్టాడు.బిజినెస్ సర్కిల్స్ లో సమర్థురాలుగా మంచి ధైర్యం ఉన్న మహిళగా పేరు గాంచిన ఉపాసనను 'భాగమతి' ఇలా భయపెట్టింది అంటే ఎవరికైనా ఆశ్చర్యం కలిగించే విషయమే. ఈవిషయాలను స్వయంగా చరణ్ షేర్ చేయడంతో అనుష్క కూడ తన ఆనందాన్ని విస్మయాన్ని ఉపాసనకు తెలియచేసినట్లు టాక్..

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com