క్షమాకాల సమయంలో ఫార్వానియా రెసిడెన్సీ శాఖ వారంలో అన్ని రోజులు పనిచేస్తుంది

- February 04, 2018 , by Maagulf
క్షమాకాల సమయంలో ఫార్వానియా రెసిడెన్సీ శాఖ వారంలో అన్ని రోజులు పనిచేస్తుంది

కువైట్: క్షమాకాల సమయంలో ఫార్వానియా రెసిడెన్సీ శాఖ వారంలో అన్ని రోజులు పనిచేస్తుందని  అంతర్గత వ్యవహారాల శాఖ వద్ద సంబంధాలు మరియు భద్రతా సమాచారం విభాగం ఒక ప్రకటనలో తెలిపింది.  కువైట్ లోని ఆరు గవర్నరేట్ పరిధిలో ఉన్న ఫార్వానియా రెసిడెన్సీ వ్యవహారాల శాఖ ద్వారా అక్రమ నివాసులు తమ హోదాను సరిచేసుకోవడం లేదా దేశం వదిలివెళ్లడం ఏదో ఒకటి చేయడం ద్వారా  నివాస చట్ట ఉల్లంఘనదారులు క్షమాబిక్ష ప్రయోజనం పొందుతున్నారని చెప్పారు. క్షమాకాల సమయంలో ఫార్వానియా రెసిడెన్సీ శాఖ కార్యాలయం వారంలో అన్ని రోజులు  అన్ని విభాగాలు తెరిచే ఉంటాయని అన్నారు అధికారిక పని గంటలలో, మధ్యాహ్నాలు మరియు వారాంతాలలో (శుక్రవారాలు మరియు శనివారాలు) 2 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు, ఫార్వానియా రెసిడెన్సీ వ్యవహారాల విభాగం పనిచేస్తుందని తెలిపారు. నిర్వాసిత చట్టాలను  ఉల్లంఘించినవారిని సైతం స్వీకరిస్తుంది. అమ్నెస్టీ ప్రయోజనాన్ని పొందటానికి మరియు వారి హోదాను సరిచేసుకోవటానికి లేదా దేశం విడిచివెళ్ళవల్సిందిగా  ఉల్లంఘనకారులను ఆ శాఖ కోరింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com