యూఏఈ ఆవిష్కరణ నెలలో సేవా ఐదు కొత్త ప్రాజెక్టుల ప్రదర్శన

- February 04, 2018 , by Maagulf
యూఏఈ ఆవిష్కరణ నెలలో సేవా ఐదు కొత్త ప్రాజెక్టుల ప్రదర్శన

షార్జా :  యూఏఈ ఆవిష్కరణ నెలలో షార్జా ఎలెక్ట్రిసిటీ అండ్ వాటర్ అథారిటీ (సేవా)  కార్యకలాపాలలో పాల్గొంటుంది. అథారిటీ సిబ్బంది మరియు పని బృందాలు సృష్టించిన ఐదు నూతన మరియు ప్రత్యేకమైన ప్రాజెక్టులు ప్రదర్శనలో చూపబడినవి. ఆవిష్కరణ సంస్కృతిని ప్రోత్సహించడానికి మరియు  షార్జా ఎలెక్ట్రిసిటీ అండ్ వాటర్ అథారిటీ (సేవా) కొత్త ఆలోచనలు ద్వారా వ్యవస్థ నవీనీకరించడానికి ప్రయత్నాలు జరుపుతున్నట్లు షార్జా ఎలెక్ట్రిసిటీ అండ్ వాటర్ అథారిటీ (సేవా) చైర్మన్ ఇంజనీర్ రషీద్ అల్ లీమ్ ఆదివారం  పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ సుప్రీం కౌన్సిల్ సభ్యుడు , షార్జా పాలకుడు డాక్టర్ సుల్తాన్ బిన్ మహ్మద్ అల్ ఖాసీమి నేతృత్వంలో ఉత్తమమైన సామర్ధ్యాన్ని సాధించాలని  లక్ష్యంగా పెట్టుకున్నారని సేవా చైర్మన్ వివరించారు. అన్ని ప్రైవేటు మరియు ప్రభుత్వ సంస్థలతో ప్రభుత్వ సేవలతో సమాజంలో పాల్గొనడానికి నూతన ఆవిష్కరణ మరియు సృజనాత్మకతపై ఆధారపడటం ఇందులో ముఖ్యమైనదని అన్నారు. ప్రతిభను అన్వేషించటానికి మరియు అభివృద్ధి చేయడానికి అన్నిరంగాలలో ఒక నూతన ఒరవడిని సాధించే లక్ష్యంగా పెట్టుకున్నాయని తెలిపారు, అథారిటీ కొత్త నిర్మాణం కొరకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పరిచి కొత్త ఆలోచనలు, ప్రతిపాదనలను స్వీకరించడం, వాటిని అధ్యయనం చేయడం,పలువురు సభ్యుల ద్వారా వాటిని అమలు చేయడానికి ,చందాదారులకు సేవలను సజావుగా అందేలా చేయడం, పని ప్రదేశాలలో పోటీతత్వాన్ని,అభివృద్ధిని పెంచడానికి పాల్గొనేవారికి ఉత్తమమైన సేవలను అందించడం వంటివి ఇందులో ప్రధానమైనవని ఆయన అన్నారు. ఆవిష్కరణ, సృజనాత్మకత ,పని వాతావరణాన్ని ప్రోత్సహించే రీతిలోఉండాలని కోరారు.నూతన ఆలోచనలను అభివృద్ధి చేయటానికి ఆ  ఆలోచనలను సృజనాత్మక నూతన ప్రతిపాదనలు అమలు చేయడానికి శాస్త్రీయ మరియు మానవ పరిశోధన రంగంలో ప్రపంచ మ్యాప్ లో యుఎఇ స్థానాన్ని మెరుగుపర్చడానికి దోహదం చేసేందుకు మెరుగైన భవిష్యత్ కోసం ఒక అనుకూల శక్తిని ఒక శక్తివంతమైన  ప్రేరణగా మార్చడానికి యూఏఈ ఆవిష్కరణ నెల సంపూర్ణంగా ప్రోత్సహిస్తుంది. అంతర్జాతీయ రంగానికి అనుగుణంగా చందాదారులకు వివిధ సేవలను అందించడానికి దోహదపడే అనేక రంగాల్లో ఆధునిక మరియు శాస్త్రీయ పద్ధతులను స్వీకరించడానికి, షార్జా ఎలెక్ట్రిసిటీ అండ్ వాటర్ అథారిటీ (సేవా) చిత్తశుద్ధితో, స్థిరమైన చర్యలు తీసుకొనేలా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com