నితిన్ మూవీ వివరాలు
- February 05, 2018
నితిన్ ప్రస్తుతం తన 25వ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. పవన్ క్రియేటివ్ వర్క్స్, సుధాకర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాకు కృష్ణ చైతన్య దర్శకుడు. త్రివిక్రమ్ అందించిన కథతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నితిన్ సరసన మేఘా ఆకాష్ హీరోయిన్‌గా నటిస్తోంది. చిత్రానికి 'గుర్తుందా శీతాకాలం' అనే టైటిల్ పరిశీలనలో పెట్టారు. కాగా ఈ చిత్రానికి సంబంధించిన అప్‌డేట్స్‌ని నితిన్ తాజాగా సోషల్ మీడియా వేదికగా తెలిపాడు.
ఫిబ్రవరి 12వ తేదీన సినిమా ఫస్ట్‌లుక్ విడుదల కానుందని, ఫిబ్రవరి 14న చిత్ర టీజర్ బయటకు వదులుతున్నామని అలాగే ఏప్రిల్ 5వ తేదీన సినిమా విడుదల కాబోతుందని వెల్లడించాడు నితిన్. ఇటీవలే 'లై' సినిమాతో కాస్త నిరాశ చెందిన నితిన్ ఈ సినిమాపై మాత్రం పూర్తి నమ్మకంగా ఉన్నాడట.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







