అన్న స్పీడ్ ను తమ్ముడు ఎప్పుడు క్యాచ్ చేస్తాడో
- February 05, 2018
అక్కినేని ఫ్యామిలీ నుండి నాగార్జున వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన అఖిల్ హీరోగా చేసిన మొదటి సినిమా అఖిల్ ఫ్లాప్ అయ్యింది. వినాయక్ డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమా అఖిల్ కు నిరాశ కలిగించింది. ఇక ఆ తర్వాత రెండేళ్లకు హలో అంటూ పలుకరించాడు అఖిల్. విక్రం కుమార్ డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమా లాస్ట్ ఇయర్ రిలీజ్ అయ్యి మళ్లీ అఖిల్ కు చేదు అనుభవాన్నే మిగిల్చింది.
24 లాంటి సూపర్ హిట్ అందుకున్న తర్వాత విక్రం కుమార్ డైరక్షన్ లో వచ్చిన హలో అంచనాలను అందుకోవడంలో విఫలమైంది. ఇక ఈ సినిమా తర్వాత అఖిల్ తన నెక్ష్ట్ ప్రాజెక్ట్ ను అసలైతే జనవరి 10 కల్లా ఎనౌన్స్ చేతానని అన్నాడు. ఆ డేట్ దాటి మరో నెల కావోస్తున్నా సరే అఖిల్ నుండి ఎలా రెస్పాన్స్ లేదు. అయితే అసలు విషయం ఏంటంటె హలో మీద విపరీతమైన కాన్ ఫిడెంట్ ఉన్న అఖిల్ ఆ సినిమా హిట్ గ్యారెంటీ అని ఫిక్స్ అయ్యి ఓ డైరక్టర్ కు ఓకే చెప్పాడట.
హలో ప్రమోషన్స్ లో సినిమాకు మంచి పాజిటివ్ బజ్ రావడంతో హిట్ పక్కా అనుకున్నారు. అయితే సినిమాను 20 కోట్లలో ముగించేసినట్టైతే సినిమా సేఫ్ ప్రాజెక్ట్ అయ్యేది కాని 30 కోట్ల బడ్జెట్ 40 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ అయ్యే సరికి సినిమా నిలబడలేకపోయింది. ఇక పోటీగా నాని ఎం.సి.ఏ కూడా వచ్చేసరికి ఆ సినిమా హిట్ అయ్యి హలో వీక్ అయ్యింది.
హలో రిలీజ్ కు ముందే సత్య పినిశెట్టి డైరక్షన్ లో సినిమా కన్ఫాం చేసుకున్నాడట అఖిల్. హలో రిజల్ట్ తేడా కొట్టేయడంతో ఈ ప్రాజెక్ట్ ఎనౌన్స్ మెంట్ లేట్ చేశారట. అయితే అఖిల్ ఇప్పటికి కన్ ఫ్యూజన్ లోనే ఉన్నాడట. నాగార్జున కూడా అఖిల్ కు హిట్ ఇచ్చే సినిమా కథ కోసం చర్చలు జరుపుతున్నాడట.
త్వరలోనే ఈ కన్ ఫ్యూజన్ కు ఓ క్లారిటీ వచ్చి అఖిల్ 3వ సినిమా ఎనౌన్స్ మెంట్ వస్తుందని చెబుతున్నారు. నాగ చైతన్య మాత్రం జెట్ స్పీడ్ లో సినిమాలు చేస్తున్నాడు. ఆల్రెడీ చందు మొండేటి సినిమాలో సవ్యసాచి సెట్స్ మీద ఉండగా.. మారుతి డైరక్షన్ లో శైలజా రెడ్డి అల్లుడు సినిమా కూడా లైన్ లో పెట్టాడు. ఈ రెండు సినిమాల తర్వాత మరో సినిమా కూడా రెడీగా పెట్టుకున్నాడు. మరి అన్న స్పీడ్ ను తమ్ముడు ఎప్పుడు క్యాచ్ చేస్తాడో చూడాలి.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







