మాల్దీవుల్లో ఇద్దరు జర్నలిస్టుల అరెస్టు ఒకతను భారతీయదు ,ఇంకొకరు బ్రిటిష్ జాతీయుడు
- February 10, 2018
మాలే: అత్యవసర పరిస్థితి అమలవుతున్న నేపథ్యంలో దేశ భద్రత పేరు చెప్పి మాల్డీవుల్లో ఇద్దరు జర్నలిస్టులను అరెస్టు చేశారు. వారిలో ఒకతను భారతీ యుడు కాగా, మరొక తను భారత సంతతికి చెందిన బ్రిటిష్ జాతీయుడు. పంజాబ్‌కు చెందిన మణిశర్మ, లండన్‌కు చెందిన అతీష్ రావ్జీ పటేల్ 'ఏఎఫ్‌పి' న్యూస్ ఏజెన్సీకి రిపోర్టర్లుగా పని చేస్తున్నారు. జర్నలిస్టుల అరెస్టుపై జాయింట్ అపోజిషన్ అధికార ప్రతి నిధి అహ్మద్ మహ్లూఫ్ స్పందించారు.మాల్దీవుల్లో ఏం జరుగుతుందో ప్రపంచానికి తెలిసిపోతుందని ప్రభుత్వం భయపడుతోందని అన్నారు. ఇక్కడ ఎంత మాత్రమూ పత్రికా స్వేచ్ఛ లేదని, గత రాత్రి ప్రముఖ టీవీ స్టేషన్లను మూసేశారని అధాలత్ పార్టీ డిప్యూటీ లీడర్ అలీ జహీర్ అ న్నారు. మాల్దీవుల్లో ఇద్దరు విదేశీ జర్నలిస్టులను అరెస్టు చేశారని, వారి లో ఒకతను భారతీయుడు కాగా, మరొకతను బ్రిటిష్ అని, వారు ఎఎఫ్‌పి ఉద్యోగులని విదేశీ వ్యవహారాల మాజీ మంత్రి అబ్దుల్లా షాహిద్ అన్నారు.
తాజా వార్తలు
- రికార్డు సృష్టించిన రోనాల్డో
- త్వరలో 190 కొత్త అంబులెన్స్‌లు ప్రారంభం: మంత్రి సత్యకుమార్
- సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసిన వ్యక్తి అరెస్టు..!!
- యూఏఈ గోల్డెన్ వీసా హోల్డర్లకు కాన్సులర్ సేవలు..!!
- ప్రైవేట్ రంగంలో విదేశీ కార్మికుల నియామకంపై నిషేధం..!!
- సిద్రా మెడిసిన్‌లో ‘హీలింగ్ నోట్స్’ ప్రారంభం..!!
- SR21 మిలియన్ల విలువైన 39వేల రిజిస్ట్రేషన్లు రద్దు..!!
- సహామ్‌లో 7వేల సైకోట్రోపిక్ పిల్స్ స్వాధీనం..!!
- Android 16 ఆధారిత కొత్త అప్డేట్ వివరాలు
- విలువైన బిట్‌కాయిన్ సీజ్ చేసిన అమెరికా